ETV Bharat / politics

అంగన్​వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్​ విధానం : సీఎం రేవంత్ - Cm Revanth Review On Anganwadis

CM Revanth Reddy Review on Woman and Child Welfare Department : గ్రేటర్ హైదరాబాద్‌లో సంచార అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy Review
CM Revanth Reddy Review on Woman and Child Welfare Department
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 6:18 PM IST

Updated : Mar 2, 2024, 10:33 PM IST

CM Revanth Reddy Review on Woman and Child Welfare Department : గ్రేటర్ హైదరాబాద్ లో సంచార(మొబైల్​) అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారన్న గణాంకాలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాలి కానీ పడిపోవద్దని స్పష్టం చేశారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా లేదో అధికారులు పర్యవేక్షించాలని సీఎం అన్నారు. కేవలం రికార్డుల్లో రాసుకొని పౌష్ఠికాహారాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆడిటింగ్ కు వీలుండేలా రికార్డులన్నీ డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీల అమలు - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు : సీఎం రేవంత్

ఆకర్షించే విధంగా అంగన్వాడీలు ఉండాలి : రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 12,315 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. చూడగానే ఆకర్షించేలా రాష్ట్రమంతటా ఒకే డిజైన్​లో అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్​ ఉండాలని సీఎం సూచించారు. మాతా, శిశు సంక్షేమం ఉట్టిపడే చిత్రాలు, ఆకర్షించే రంగులతో ఈ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అవసరమైతే ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవం నిర్వహించాలని సీఎం అన్నారు.

CM Revanth Reddy Review : శానిటరీ నాప్కిన్స్ తయారీ కోసం స్వయం సహాయక సంఘాల మహిళలతో యూనిట్లు నెలకొల్పాలని సీఎం తెలిపారు. దివ్యాంగులకు చట్టం ప్రకారం విద్యలోనూ ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని అధికారులు తెలపగా దానికి అనుగుణంగా ఫైలు సిద్ధం చేసి పంపించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న బోధనాస్పత్రుల్లో ట్రాన్స్​ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా, సరైన అవకాశాలు కల్పించేందుకు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానాన్ని తయారు చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు వాకాటి కరుణ, క్రాంతి వెస్లీ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ అవసరం : సీఎం రేవంత్​

Last Updated : Mar 2, 2024, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.