ETV Bharat / politics

కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - రెండ్రోజుల పాటు లోక్​సభ ఎన్నికల ప్రచారం - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

CM Revanth Reddy Kerala Tour : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రోజున కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్​సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి

CM REVANTH REDDY TOUR
CM REVANTH REDDY TOUR
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 2:51 PM IST

Updated : Apr 16, 2024, 3:36 PM IST

CM Revanth Reddy Kerala Tour : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) బుధవారం రోజున కేరళ వెళ్లనున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అక్కడి లోక్​సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజున రేవంత్ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఈనెల 18వ తేదీన రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పేర్కొన్నారు. 19న మహబూబ్​నగర్​, మహబూబాద్​లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు.

ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్​​రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha

CM Revanth Reddy Campaign in Other States : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్(Congress) నాయకత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారు.

రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్‌ భారీగా పెరిగింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరుకాగా విశేష స్పందన లభించింది.

రేవంత్‌రెడ్డిని క్రేజ్‌ను ఇతర రాష్ట్రాల్లో వాడుకునేలా : ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి క్రేజ్‌ను ఇతర రాష్రాల్లోనూ వాడుకునేలా కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో హస్తం పార్టీ అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఇవాళ మహారాష్ట్రలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో పర్యటన రద్దైంది.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు (T CONGRESS MP CANDIDATES) అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్‌, కరీంనగర్, ఖమ్మం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 18న ఎన్నికల షెడ్యూల్ రానుంది.

అప్పుడు షైన్​ ఇండియా - ఇప్పుడు వికసిత్​ భారత్​ - హిస్టరీ రిపీట్​ అవుద్ది : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth Reacts on BJP Manifesto

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు : రేవంత్​ రెడ్డి - REVANTH REDDY on paddy procurement

Last Updated : Apr 16, 2024, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.