CM Revanth Comments on KCR and PM Modi : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బలమైన అభ్యర్థులు, సామాజిక సమీకరణాలు ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకొనే తమ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 12 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో హస్తం అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Revanth Criticizes PM Modi : నరేంద్ర మోదీ (CM Revanth on PM Modi)ప్రభావం మసకబారతుందని రేేవంత్‌రెడ్డి తెలిపారు. మాటలు చెప్పి పని చేయకుంటే ఎంత కాలం ప్రజలు నమ్ముతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను ఇప్పటికే తిరస్కరించిన ప్రజలు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూడా ఇదే రకమైన తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు అన్ని రకాల డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. లోపల మాత్రం పరస్పరం సహకరించుకొందాం అన్నట్లుగా మొత్తం వ్యవహారం నడుస్తోందని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు.
మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ : మణుగూరు సభలో సీఎం రేవంత్
పార్టీ పని, ప్రభుత్వ పనిలో స్పష్టమైన తేడా ఉంటుంది : 'మనది సమాఖ్య వ్యవస్థ. ప్రధాని అన్ని రాష్ట్రాలకు బాధ్యత వహిస్తారు కాబట్టే ఇటీవల తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన్ను కలిశాను. పెద్దన్న అని సంబోధించాను. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రధానమంత్రిగా వచ్చారు, సీఎంగా స్వాగతం చెప్పా, రాష్ట్రానికి ఏమేం కావాలో కోరాను. ప్రధానికి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ సర్కార్, పరివార్, పార్టీ అన్నీ ఒకటే అనుకొంటారు మోదీ. మేం అలా కాదని' రేవంత్‌రెడ్డి అన్నారు.
"రాష్ట్ర సర్కార్‌కు తెలంగాణ ప్రజల విస్తృత ప్రయోజనాలు, అభివృద్ధి ఇలా అనేక అంశాలు ముఖ్యం. పార్టీగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, సైద్ధాంతిక పోరాటం, ప్రజల హక్కులు కాపాడటం వంటి కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ పని, ప్రభుత్వ పనిలో స్పష్టమైన తేడా ఉంటుంది. కానీ బీజేపీ అలా కాదు. అది ఎన్నికలప్పుడే రాజకీయాలు అని అంటున్నా. ఆచరణలో చూస్తే చెప్పేదానికి, చేసేదానికి ఎంత తేడా ఉందో తెలిసిందే. హస్తం పార్టీ లౌకిక విధానాలతో ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేసిన అభివృద్ధే ఇందుకు నిదర్శనం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని సంకుచిత విధానాలు : భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే నియోజకవర్గాల సంఖ్య తగ్గి లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్పారు. అలాగే జనాభా ఆధారంగా నిధుల కేటాయింపు వల్ల కూడా నష్టం జరుగుతుందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో చదువుకొన్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబ నియంత్రణ పాటించడం, ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు పరిమితం కావడం వల్ల జనాభా నియంత్రణ జరిగినట్లు పేర్కొన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని సంకుచిత విధానాలను అవలంబించే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు మోదీ, అమిత్ షాల తరం కాదు : రేవంత్‌రెడ్డి
CM Revanth on Six Guarantees : గత వంద రోజుల్లో తమ ప్రభుత్వం అమలు చేసిన హామీలు (Congress Six Guarantees in Telangana) కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా బీజేపీ-బీఆర్ఎస్ నేతలు ఒకే భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆరు నెలల్లో సర్కార్ పడిపోతుందని, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నిద్ర లేచినప్పటి నుంచి రెండు పార్టీల నాయకులకూ ఇదే పనా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వ్యూహాలు తమకు ఉంటాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షునిగా పార్టీని, సీఎంగా సర్కార్‌ను కాపాడటానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి మంచి ప్రభుత్వంగా జన మన్ననలను పొందడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటామని వ్యాఖ్యానించారు. మరోవైపు గతంలో జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చి చర్యలు తీసుకొంటున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
'కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి - ఆయన నాటిన గంజాయి మొక్కలు వాసన వెదజల్లుతున్నాయి'