ETV Bharat / politics

కార్యకర్తల త్యాగాలను మరవను - వాళ్లను గెలిపించేవరకు నా బాధ్యత తీరదు : సీఎం రేవంత్ - చేవెళ్లలో కాంగ్రెస్ జనజాతర సభ

CM Revanth Chevella Meeting Today : అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపించాలని కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గం ఒక్కటీ లేదని అన్నారు. కార్యకర్తల త్యాగాన్ని తాను ఎప్పటికీ మరిచిపోనన్న రేవంత్ రెడ్డి, కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిచినప్పుడే తన బాధ్యత నెరవేరుతుందని తెలిపారు.

CM Revanth Chevella Meeting Today
CM Revanth Chevella Meeting Today
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 7:38 PM IST

Updated : Feb 27, 2024, 7:53 PM IST

కార్యకర్తల త్యాగాలను మరవను - వాళ్లను గెలిపించేవరకు నా బాధ్యత తీరదు : సీఎం రేవంత్

CM Revanth Chevella Meeting Today : అసెంబ్లీ ఎన్నికల నాటి ఊపు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఏమాత్రం తగ్గలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గం ఒక్కటీ లేదన్న రేవంత్, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటులో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ శ్రేణుల త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోనని, వాళ్ల రుణం తీర్చుకుంటామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర బహిరంగ సభ (Congress Jana Jatara Meeting Chevella) లో సీఎం రేవంత్ సహా, మంత్రులు ప్రసంగించారు.

"కేసీఆర్‌ తన కుటుంబీకుల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారు. కేసీఆర్‌ తన కుమార్తె, కుమారుడు, అల్లుడు, బంధువుల పదవుల గురించే ఆలోచించారు. మేం అధికారంలోకి వచ్చిన 2నెల్లలోపే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తండ్రి పేరు చెప్పుకుని పదవుల్లో కూర్చున్న వ్యక్తిని కాదు నేను. దుర్మార్గులను, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చివ వ్యక్తిని. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌ కుటుంబానికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు. ఎంపీలను గెలిపించటంతోనే నా బాధ్యత తీరిపోదు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి న్యాయం చేస్తాం. కార్యకర్తలను సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిపించినప్పుడే నా బాధ్యత నెరవేరుతుంది." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

Bhatti Vikramarka At Congress Meeting Chevella : అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని తెలిపారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ ఉండదని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్‌ ఉందో లేదో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

సచివాలయంలో సబ్సిడీ వంట గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాలు ప్రారంభం

"గత ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసింది. తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కట్టారు. నిపుణులు, ఇంజినీర్లు వద్దంటున్నా మేడిగడ్డ వద్ద కట్టారు. అద్భుతంగా కట్టామని కేసీఆర్‌ చెప్పిన ప్రాజెక్టులు ఇవాళ పగుళ్లు పట్టాయి. రూ.లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృథా చేశారు. పాలమూరు ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఆ జిల్లాకు ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu on Six Guarantees) అన్నారు. కాంగ్రెస్ వచ్చేది లేదు ఇచ్చేది లేదని వెటకారంగా మాట్లాడారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదని తెలిపారు. ఖాజానా ఖాళీ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆర్థిక క్రమశిక్షణతో పని చేస్తూ నిధులు సమకూర్చుకుని ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పారు.

సంస్కారహీనమైన కామెంట్స్ చేయడం దారుణం : బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ మహిళల పట్ల సంస్కారహీనంగా మాట్లాడారని దుయ్యబట్టారు. ఒక మంత్రి తల్లి పట్ల బీజేపీ నేత సంస్కారహీనంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా మా ప్రణాళికలు సాగుతున్నాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రజలంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.

అడ్రెస్ లేకుండా పోయారు వాళ్లు : అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్‌ను ప్రజలు బొంద పెట్టారని మండిపడ్డారు. పేదలు, మధ్య తరగతి వారికి మేలు జరిగేలా ఇవాళ మరో 2 పథకాలు ప్రారంభించామని తెలిపారు. మంత్రి సీతక్క (Minister Seethakka At Chevella Meeting) మాట్లాడుతూ కాంగ్రెస్‌ గ్యారంటీలకు వారంటీ లేదని హేళన చేసినవాళ్లు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారం మోపాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కో హామీ అమలు చేస్తుంటే బీఆర్ఎస్ భయపడుతోందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి పదవి మొదలుకుని మహిళలకు ఎన్నో కీలక పదవులు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్‌ పార్టీ. గత ప్రభుత్వం మహిళల అభయ హస్తం డబ్బులను కూడా వాడుకున్నది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ రూ.105కే 9 సరుకులు ఇచ్చింది. ఇప్పుడు కూడా పేదలపై ధరల. భారం పడొద్దని రూ.500కే గ్యాస్‌ సిలిండర్ ఇస్తున్నాం. పేదల ఇళ్లకు వెలుగులు పంచేలా రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. - సీతక్క, రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి

రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడంలో తెలంగాణ కీలకపాత్ర పోషించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే గ్యారంటీలు అమలు చేశామని, ఇవాళ మరో రెండు పథకాలను ప్రారంభించామని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ సర్కార్‌ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామనే వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు.

ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీల అమలు - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు : సీఎం రేవంత్

'గృహజ్యోతి'కి ఆధార్ కార్డు​ తప్పనిసరి - ఇలా చేస్తేనే ఫ్రీ కరెంట్​కు అర్హులు

Last Updated : Feb 27, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.