AP Govt MOU with EDEX Online Courses : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ఆన్ లైన్ ద్వారా ఇక్కడి నుంచే నేర్చుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం వెల్లడించారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎడెక్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు.
పాఠశాల విద్యలో ఐబీ సిలబస్ కోసం ఇంటర్ నేషనల్ బాక్యులరెట్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ప్రపంచస్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఎడెక్స్ ద్వారా మన పిల్లలు ఇక్కడి నుంచే అదనంగా విదేశీ కోర్సులు అభ్యసించవచ్చని సీఎం తెలిపారు. ఎడెక్స్ తో చేసుకున్న ఎంవోయూ గొప్ప అడుగు అని తెలిపిన సీఎం, ఒప్పందం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన యూనివర్సిటీల నుంచి దాదాపు 2 వేల కోర్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత కళాశాలల కోర్సులు ఆఫర్ చేసి అన్లైన్ ద్వారా బోధిస్తారని తెలిపారు. కోర్సు కు సంబంధించిన పరీక్షలు నిర్వహించాక సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు. పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉంటేనే ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాలు సాధిస్తారన్న సీఎం, దీని కోసమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రతి యూనివర్సిటీకి విదేశీ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడమే ఎడెక్స్ ఒప్పందం ఉద్దేశమని, ప్రతి విశ్వవిద్యాలయం వీసీ వీటి వినియోగం కోసం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అంతర్జాతీయ ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం: సీఎం జగన్
విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండానే ఇక్కడి నుంచే కోర్సులు పూర్తి చేసి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు పొందే అవకాశం పొందుతారన్నారు. మనం పోటీ పడుతోంది భారత దేశంతో కాదని ప్రపంచంతో అని తెలిపిన ముఖ్యమంత్రి, ప్రపంచంతో పోటీ పడకపోతే మన భవిష్యత్ మారదని పేర్కొన్నారు. ఆన్లైన్ కోర్సులు పూర్తి చేయడం వల్ల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ తదితర యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు వస్తాయన్నారు.
ఇంజినీరింగ్, వృత్తివిద్య విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
ఎడెక్స్ తో ఒప్పందం వల్ల 12 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఆన్ లైన్ కోర్సులతో ఎపీ విద్యార్థులకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశంగా ఉంటుందని, అందరూ వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌తో.. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం