ETV Bharat / politics

వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు మార్పు - సాయిరెడ్డి బాధ్యతలు చెవిరెడ్డికి

CM Jagan Changes YSRCP Regional Coordinators: వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా తొలంగించి ఆ బాధ్యతలను ఇప్పటికే ఒంగోలు జిల్లా సమన్వయకర్తగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి అదనంగా అప్పగించారు. దీంతో జగన్ విజయసాయి రెడ్డిని పార్టీకి దూరంగా పెడుతున్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

CM_Jagan_Changes_YSRCP_Regional_Coordinators

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 8:58 AM IST

CM Jagan Changes YSRCP Regional Coordinators : ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జ్​ల పేరుతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్ లేదని కరాఖండిగా చెప్పింది. ఆ పార్టీ ప్రకటించిన ఆరు జాబితాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కీలక నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్తల్లో మార్పులు చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేసిన, చేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి పేరు లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆయన స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. కేవలం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా అదే చెవిరెడ్డి కోసం విజయ సాయి రెడ్డిని పార్టీకి దూరంగా పెట్టిందని సమాచారం. ఈ పరిణామాలు చూస్తుంటే బాలినేనికి ఎదురైన పరాభవమే సాయిరెడ్డికి ఎదురవుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయం-బాలినేనికి అధిష్టానం షాక్?

వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు, తిరుపతిలను ఆయన వద్ద నుంచి తీసేశారు. ఈ రెండు జిల్లాల బాధ్యతలను ఇప్పటికే ఒంగోలు జిల్లా సమన్వయకర్తగా ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి అదనంగా అప్పగించారు. విజయసాయిరెడ్డి నుంచి ఈ మధ్యనే ప్రకాశం జిల్లా బాధ్యతలు చెవిరెడ్డికి అప్పగించారు.

వైసీపీలో కుప్పకూలిన టాప్​ఆర్డర్​... 'నైట్ ​వాచ్​మెన్'​దే భారం

నియోజకవరాల పార్టీ సమన్వయకర్తల మార్పుల్లో భాగంగా అనకాపల్లి సీటు కోల్పోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఇప్పుడు పార్టీ బాధ్యత అప్పగించారు. అదీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పని చేసేలా ఉప ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. అదే తరహాలో విజయవాడ సెంట్రల్‌లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు విజయవాడ నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కర్నూలు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి నంద్యాల జిల్లా బాధ్యత కూడా ఇచ్చారు. ఇప్పటి వరకూ నంద్యాల జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డిని పూర్తిగా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన్ను రాజంపేట అసెంబ్లీ నియోజకవర ఇన్‌ఛార్జిగా ఈ మధ్యనే నియమించారు. వైఎస్సార్ జిల్లా ఇన్‌ఛార్జిగా ఉన్న కె. సురేష్‌బాబుకు ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ పరిధిని కూడా అప్పగించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.