ETV Bharat / politics

"దటీజ్​ చంద్రబాబు" హాట్​టాపిక్​గా దిల్లీ తొలి పర్యటన​- నాడు జగన్​ 29సార్లు - CBN Delhi Tour - CBN DELHI TOUR

CBN Delhi Tour: అధికారంలోకి వచ్చిన 23రోజుల్లోనే సీఎం చంద్రబాబు చేపట్టిన దిల్లీ పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రధాన మంత్రి మోదీ సహా మరో ఏడుగురు మంత్రులను కలిశారు. రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై నివేదికలు అందించారు. మాజీ సీఎం జగన్​ ఐదేళ్లలో 29సార్లు దిల్లీకి వెళ్లినా.. కేసుల నుంచి బయటపడేందుకు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది.

cbn_delhi_tour
cbn_delhi_tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 4:36 PM IST

CBN Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. సీఎం హోదాలో తొలిసారిగా దిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో పాటు ఆర్థిక సంఘం చైర్మన్​ను కూడా కలిసి ఆశ్చర్యపరిచారు. సాధారణంగా దిల్లీ పర్యటన అంటే కేంద్ర పెద్దల్లో ఒకరిద్దరిని మాత్రమే మర్యాదపూర్వకంగా కలవడం పరిపాటి. కానీ, రాష్ట్ర ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు తొలిపర్యటన సాగిన తీరు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు.

మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీ - త్వరలోనే అధికారిక ప్రకటన - Chandrababu Meet Central Ministers

2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ, అప్పట్లో పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్​ తన పదవీ కాలంలో 29సార్లు దిల్లీకి వెళ్లొచ్చారు. ఆయన ప్రతీ పర్యటన రహస్యమే. దిల్లీ ఎందుకు వెళ్తున్నారో? ఎవరిని కలుస్తున్నారో! ఏ విషయాలు చర్చిస్తున్నారో! ఏ ఒక్కరికీ అంతు చిక్కేది కాదు. పోలవరం నిధుల కోసమంటూ ఆపార్టీ నేతలు ఊదరగొట్టినా, ప్రాజెక్టు నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నది వాస్తవం. ప్రజా ధనంతో ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లిన జగన్. రాష్ట్రానికి సాధించిందేమీ లేదన్నది జగమెరిగిన సత్యం. జగన్​ దిల్లీ పర్యటనల ఆంతర్యమేమిటని అప్పట్లో ప్రతిపక్షాలు నిలదీశాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డాయి.

దిల్లీలో మారిన లెక్క - రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపైనే వరుస భేటీలు - CBN Delhi Tour

విశాఖ పరిశ్రమ ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరిగినా, రోజుల తరబడి కార్మికులు ఆందోళనకు దిగినా జగన్​ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. 'అదిగో, ఇదిగో' అంటూ పోలవరం ప్రాజెక్టుపై కాలయాపన చేశారు తప్ప కేంద్రాన్ని అడిగిందే లేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై జగన్​ కేంద్రాన్ని ఏనాడైనా కోరిందే లేదు. పైగా ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం కేంద్రం కోరిన స్థలాన్ని అప్పగించడంలో జగన్​ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తెలిసిందే.

"ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్ను"ని కాపాడ‌టానికి, అక్రమాస్తుల కేసులు నుంచి తప్పించుకోవడానికి జగన్​ తన అధికారాన్ని వాడుకున్నాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఆయన ఏనాడైనా దిల్లీ పర్యటన చేసిందే లేదు. ప్రత్యేక హోదా కోసమంటూ 2018లో రాజీనామాల పేరుతో హడావుడి చేసిన ఆ పార్టీ ఎంపీలు అధికారంలోకి వచ్చాక హోదా గురించి ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించిన పాపానపోలేదు అని జనం చర్చించుకుంటున్నారు.

ఏపీకి తగిన సాయం అందించండి - నిర్మలా సీతారామన్​కు చంద్రబాబు విన్నపం - Chandrababu Met Nirmala Sitharaman

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.