CM Chandrababu Review on RTGS with Officials: ప్రజలకు నాణ్యమైన సేవలు, సమర్థ పాలన అందించేలా అన్ని ప్రభుత్వశాఖలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల్లో రియల్‌టైమ్ సమాచారాన్ని సేకరించి ఆర్టీజీఎస్ ద్వారా సమీకృతం చేయాలన్నారు. అంతిమంగా 'వాట్సప్ గవర్నెన్స్' ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (Real Time Governance Society) అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు తక్కువ సమయంలోనే అందించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇకపై వాట్సప్ ద్వారా పౌరసేవల జారీ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సహా ఇతర పత్రాలను వాట్సప్ ద్వారానే అందించేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరణకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డీప్‌టెక్ టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. వినతుల పరిష్కారం, ప్రజల సంతృప్తి స్థాయినీ ఆర్టీజీఎస్ పరిశీలించాలన్నారు. డ్రోన్లు, సీసీ కెమేరాలు, శాటిలైట్లు, ఐవోటీ డివైజ్‌ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్‌ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
విజయసాయిరెడ్డి ఇంకా బయట ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది : సోమిరెడ్డి
చివరి దశకు హౌస్‌హోల్డ్ జియో ట్యాగింగ్: ఇటీవల గూగుల్ మ్యాప్‌ల ద్వారా గుర్తించిన గంజాయి పంటను డ్రోన్ల సాయంతో ధ్రువీకరించిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం రానున్న రోజుల్లో పంట తెగుళ్లను గుర్తించి, రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలోని రహదారులపై ప్రమాద స్థలాలనూ డ్రోన్లద్వారా అన్వేషించి పరిష్కరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హౌస్‌హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95 శాతం కుటుంబాల జియో ట్యాగింగ్ పూర్తిచేశామని అధికారులు సీఎంకు తెలిపారు.
ఆధార్ సంబంధింత సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేలా మరో 1000 ఆధార్ కిట్ల కొనుగోలు కోసం రూ.20 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారు. అలాగే రాష్ట్రంలో 100 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌ల పర్యవేక్షణకు ఒకే పోర్టల్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్‌టైమ్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. రాష్ట్రంలో జనన –మరణ ధృవపత్రాలు పొందేందుకు తలెత్తుతున్న ఇబ్బందులను శాశ్వత పరిష్కారంగా తీసుకువస్తున్న నూతన వెబ్ పోర్టల్‌ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ - పోలీసుల అదుపులో మల్లికార్జునరావు