CM Chandrababu Receiving Requests From People at NTR Bhavan : వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు సమస్యలతో పోటెత్తుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వినతులతో వచ్చి ఇక్కట్లను ఏకరవు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కిక్కిరిసిపోయింది. దాదాపు రెండున్నర గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించడంతో పాటు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు
వైఎస్సార్సీపీ భూకబ్జాలపైనే ఫిర్యాదులొస్తున్నాయి: మంత్రి సవిత - Minister Savitha Received Requests
వినతులు వెల్లువ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయామంటూ వినతులతో తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరి దగ్గరికి నేరుగా వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటల పాటు వినతులు స్వీకరించారు. 15 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాల జాబితాలో కలిపి పరిహారం కొట్టేశారని ఆచంట నుంచి వచ్చిన మహిళ ఆవేదన చెందడంతో ఆమె సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు వినతులు ఇచ్చారు. వివిధ సమస్యలకు న్యాయస్థానం తీర్పులున్నా తమకు న్యాయం చేయకుండా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూములు వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారంటూ ఇంకొందరు వినతలు సమర్పించారు.
"నేను కష్టపడి 15 సెంట్లు స్థలాన్ని కొనుక్కున్నాను. దాని పక్కనే వైఎస్సార్సీపీ నేతలు స్థలం తీసుకున్నారు. ఇప్పుడు నా స్థలాన్ని వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా ఆక్రమించుకున్నారు. నేను స్థలం దగ్గరకు వెళితే మా అక్క, వైఎస్సార్సీపీ నేతలు నన్ను కొట్టి, నా మెడలో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. రూ.60 లక్షలు ఇచ్చి నీ స్థలం తీసుకోవాలని బెదిరించారు. నాకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు"_పిల్లి పార్వతి, ఆచంట
ఆళ్ల నాని పరిహారం అందకుండా చేశారు - మంత్రి లోకేశ్‌కు బాధితుడి మొర - Lokesh Praja Darbar 17th Day
వైఎస్సార్సీపీ హయాంలో నష్టపోయం : సంతకాల ఫోర్జరీతో 30 లక్షల రుణాలు తెచ్చారన్న చిలకలూరిపేట డ్వాక్రా సంఘాలు చంద్రబాబుకి ఫిర్యాదు చేశాయి. విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తాము ఎలా బాధితులు అయ్యిందీ ముఖ్యమంత్రికి పలువురు వివరించారు. గత ప్రభుత్వం నేతలు అక్రమంగా లాక్కున్న తమ ఆస్తులను తిరిగి తమకు అప్పగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చారని యానిమేటర్లపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. అంశంపై విచారణ చేయించి, నిందితులపై చర్యలు తీసుకుని సొమ్మును రికవరీ చేయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
రోడ్డుపై కాన్వాయ్ ఆపిన సీఎం- ఆప్యాయంగా పలకరించి, వినతులు స్వీకరించిన చంద్రబాబు - CM Chandrababu
సమస్యలన్నీ పరిష్కరిస్తాం : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమకు ఉద్యోగాలు క్రమబద్దీకరణ చేస్తే, ఆ ఉత్తర్వులు అమలు కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు వినతిపత్రం ఇచ్చారు. గత ఐదేళ్లలో పనులు చేసిన తెలుగుదేశం గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదని ఆ డబ్బులు ఇచ్చేలా ఆదేశించేలా చూడాలని పల్నాడు జిల్లా వినుకొండ వచ్చిన 50 మంది సీఎంని కోరారు. ప్రతి ఒక్కరి దగ్గరకి వచ్చి స్వయంగా వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పడంపై ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు.