ETV Bharat / politics

రెండున్నరేళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు - CM chandrababu entered to assembly - CM CHANDRABABU ENTERED TO ASSEMBLY

CM Chandrababu Entered to Assembly: రెండున్నరేళ్ల తర్వాత సగౌరవంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గౌరవ సభలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు.

CM Chandrababu Entered to Assembly
CM Chandrababu Entered to Assembly (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 3:18 PM IST

CM Chandrababu Entered to Assembly : రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్‌ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవసభలో అడుగుపెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు.

నాటి శపథం నిలబెట్టుకుంటూ: "సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తాను, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకో నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవమానాన్ని అందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నాను" ఆంధ్రప్రదేశ్​ శాసనసభలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.

2021 నవంబర్​ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్​ మైక్​ కట్​ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు సీఎంగా సభకు: తాజాగా నాడు సభనుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు, నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగోసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు. నేడు అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకు మొదటి గేటు వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆశీనులయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సీఎం చంద్రబాబు సభలోకి ప్రవేశించారు.

గౌరవ సభగా మారిన నేపథ్యం జగన్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్నిలోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దాని కనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి నివాళులర్పించారు. ముందుగా వెంకటపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. విగ్రహం వద్ద నుంచే ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

శపథం నెరవేరిన వేళ - రెండున్నరేళ్ల తర్వాత సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు - ap cm cbn oath at assembly

తెలుగు జాతికి పెద్దన్నలా ఉంటాను - అమరావతిని హైదరాబాద్​ మాదిరి తీర్చిదిద్దుతా : ఏపీ సీఎం చంద్రబాబు - AP CM CHANDRABABU ON HYD

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.