ETV Bharat / politics

నదికి వాగుకు తేడా తెలియదు- జగన్​కు ఏం పని ఉందని లండన్‌కు వెళ్తున్నారు: సీఎం - Chandrababu Fires on Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 11:48 AM IST

Updated : Sep 5, 2024, 2:37 PM IST

Chandrababu Fires on Jagan : తాను పనిలేక వరదల్లో తిరుగుతున్నానన్న జగన్‌, ఏం ఎక్కువ పని ఉందని లండన్‌కు వెళ్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. బుడమేరుకు గండ్లకు కారణమైన దుర్మార్గుడు జగన్​ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు ఆలోచనలు చేసిన ఆ పార్టీ తీరును ప్రజలే ఎండగడుతున్నారని విమర్శించారు.

Chandrababu Fires on Jagan
Chandrababu Fires on Jagan (ETV Bharat)

CM Chandrababu Comments on Jagan : అధికారంలో ఉన్నప్పుడు రెడ్‌ కార్పెట్‌పై వెళ్లి జగన్ నష్టాన్ని పరిశీలించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు తాను బురదలో తిరుగుతున్నాను కాబట్టి ఆయన బురదలో దిగారని దుయ్యబట్టారు. తాను బురదలో దిగకపోతే అధికారులు దిగుతారా? వారిని వెళ్లమనే హక్కు నాకుంటుందా? అప్పుడు ప్రజల పరిస్థితేంటి? వారి దగ్గరకు వెళ్లేదెవరు? అని చంద్రబాబు తెలిపారు.

"గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్‌ పట్టించుకున్నారా. నేను వెళ్లాను కనుకే అధికారులు వేగంగా స్పందించారు. నదికి వాగుకి తేడా తెలియనివాడు నా పనితీరును విమర్శిస్తాడా. బుడమేరు ఎక్కడ ఉంది నా ఇల్లు ఎక్కడ ఉంది. నా ఇల్లు మునిగిపోతుందని బుడమేరు గేట్లు ఎత్తానని అంటున్నారు. అబద్ధం చెప్పినా నమ్మేలా ఉండాలి. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం. విలాస వంతమైన జీవితానికి అలవాటు పడ్డ చేతగాని వ్యక్తి జగన్. అలాంటి వారికి ప్రజల కష్టాలు తెలియవు. జగన్​కు పని లేదు కాబట్టే లండన్ వెళ్తున్నాడు." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

వాగుకు, నదికి తేడా తెలియని వ్యక్తి జగన్‌ : ముఖ్యమంత్రి పనిచేయాల్సిన అవసరం లేదని పని చేయకుంటే అన్నీ అయిపోతాయని జగన్ సమర్థించుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆయనో సైకో అని ధ్వజమెత్తారు. తాను చెప్పేదే సరైందని నమ్మిస్తారని ఆక్షేపించారు. జనానికి ముద్దులు పెట్టి, ఇంట్లోకి వెళ్లాక పదిసార్లు చేతులు కడుక్కునే జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులని దుయ్యబట్టారు. టమోటాకు పొటాటోకు నదికి వాగుకు తేడా తెలియని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. జగన్​కు తెలిసిందల్లా సాయంత్రానికి గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఎంత వసూలైందో చూసుకోవడమేనని చంద్రబాబు వ్యంగాస్త్రాలు సంధించారు.

పొటాటో అంటే ఉల్లిగడ్డలు ! సోషల్​ మీడియాలో సీఎం వ్యాఖ్యలు వైరల్​

వరదల్లో స్వార్ధ రాజకీయాలు చేద్దామనుకున్న జగన్‌ను ప్రజలు నిలదీస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమకేం చేశారో చెప్పాలని పరామర్శకు వచ్చిన ఆయనను ప్రజలే నిలదీస్తున్నారని చెప్పారు. ఇది ప్రజా చైతన్యమన్నారు. దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తుల్ని ప్రజాజీవితం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మంచిని మంచి చెడును చెడు అని చెప్పగలిగితే రాష్ట్రంలో అరాచకాలు ఉండవని ఆకాంక్షించారు. గతంలోలా ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదని ఆ విషయాన్ని జగన్‌ గ్రహించాలని చంద్రబాబు సూచించారు.

వాగుకు నదికి తేడా తెలియని ఒక వ్యక్తి దుర్మార్గానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు : సీఎం చంద్రబాబు - cbn fire on jagan

వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యం- ఆపద సమయంలో కుట్రలా? : చంద్రబాబు - CM review flood relief measures

Last Updated : Sep 5, 2024, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.