CM Chandrababu Discussion on New Industrial Policy: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల బృందం కూడా సీఎంతో సమావేశమైంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది.
దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు ఛైర్మన్‌గా, టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కో ఛైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పని చేయనుంది. అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించింది.
ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామికానుంది. విశాఖలో టీసీఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రంలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్‌తో సీఎం చర్చించారు.
కాగా రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై సీఎం దృష్టి సారించారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు సీఎం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు.
"మిత్రుడు, టాటాసన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశం జరిగింది. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్. చంద్రశేఖరన్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు కో-ఛైర్‌గా ఉంటారు. అమరావతిలో సీఐఐ ఏర్పాటు చేయనున్న జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్ ఆన్ కాంపిటీటివ్‌నెస్‌లో టాటా భాగస్వామి. విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఎయిరిండియా, విస్తారాతో ఏపీ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ బహుళరంగాల్లో అనేక భాగస్వామ్యాలను అన్వేషించాం." - సీఎం చంద్రబాబు
సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చంద్రబాబుతో భేటీ : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐఐ ద్వారా అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ (GLC) ఏర్పాటుపై చర్చించారు. ఆర్థికాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్ సిఫార్సులకనుగుణంగా ప్రభుత్వం, సీఐఐ ఇండస్ట్రీ ఫోరమ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. సీఐఐ మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, సీఐఐ మోడల్ కెరీర్ సెంటర్ వంటి కార్యక్రమాల ద్వారా ఏపీ యువతలో నైపుణ్యాలు, ఉపాధిని పెంపొందించడంపై దృష్టి పెడతామని సీఎం తెలిపారు.
I had a great meeting with my old friend, the Chairman of Tata Sons, Mr. Natarajan Chandrasekaran in Amaravati today. The GoAP is forming a Task Force for Economic Development of Swarna Andhrapradesh @ 2047 with intellectuals & industry leaders as its members. I'm delighted to… pic.twitter.com/8xmHTQGIlq
— N Chandrababu Naidu (@ncbn) August 16, 2024
I had a productive meeting with a delegation from the Confederation of Indian Industry (CII) headed by its Director General, Mr. Chandrajit Banerjee. We discussed the establishment of a Centre for Global Leadership on Competitiveness (GLC) in Amaravati by the CII.
— N Chandrababu Naidu (@ncbn) August 16, 2024
The… pic.twitter.com/o93Gu1NxY2