Class War in YCP Across the State: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఆరు మండలాల సంబంధించిన వైసీపీ అసమ్మతి నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అసమ్మతి నాయకులు మాట్లాడుతూ పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఏ సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఆరు మండలాల అసమ్మతి నాయకులతో చెయ్యి కలిపి పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి ఏదైనా సమస్య విన్నవిస్తే పీఎనీ కలవమంటారని తీరా అక్కడికి వెళ్లాక ఎమ్మెల్యే పీఏ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గుణపాఠం చెబుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అసమ్మతి నాయకులు పాల్గొన్నారు.
వైసీపీలో ఆగని ఇన్ఛార్జీల మార్పు - సీఎంవోకు క్యూ కడుతున్న నేతలు
YCP MLA Tippeswamy is Unhappy: అదే జిల్లాలోని మడకశిర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మడకశిర వైసీపీ నాయకుడు అశోక్ కుమార్‌పై ఎమ్మెల్యే తిప్పేస్వామి అసహనం తెలిపారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా భేటీలు పెడుతున్నారని తిప్పేస్వామి తెలిపారు. ఎస్సీ ఎమ్మెల్యే అయినందున అవమానిస్తున్నారని తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు లేకుండా భేటీ నిర్వహించారని తిప్పేస్వామి ఆరోపించారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి వైసీపీ నాయకుడు అశోక్ కుమార్‌కు లేఖ పంపగా ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదు - రాజీనామా చేసేందుకు ఎంతోసేపు పట్టదు: బాలినేని
Differences in YCP at Proddutur: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సర్పంచ్ శివచంద్రారెడ్డి, కౌన్సిలర్లు మురళీధర్, భాస్కర్, లక్ష్మిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే రాచమల్లుతో వైసీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ శివచంద్రారెడ్డి అన్నారు. తమ వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 30 వేల ఓట్లతో గెలుస్తామని తెలిపారు. ఈ ఎన్నికలకు ప్రొద్దుటూరు టికెట్ విషయంలో జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇస్తే మద్దతివ్వమని కౌన్సిలర్ మురళీ తెలిపారు. ఎమ్యెల్యే రాచమల్లుపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని అన్నారు. నిజాయతీ గల కార్యకర్తలను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'స్థానికేతరుల పెత్తనమేంటి?' - ఎమ్మెల్యే రెడ్డి శాంతి పనితీరుపై వైసీపీ నాయకుల అసంతృప్తి
కర్నూలు వైసీపీ అసెంబ్లీ సీటు హఫీస్ ఖాన్‌కే: వచ్చే ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అసెంబ్లీ సీటు స్థానిక ఎమ్మెల్యే హఫీస్ ఖాన్‌కే ఇవ్వాలని హాఫీస్ ఖాన్ మద్దతుదారులు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. హఫీస్ ఖాన్‌కు మద్దతుగా కర్నూలు నగరంలోని ఉర్దూ ఘర్ భవనంలో వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారుతున్నట్లు వదంతులు రావడంతో వారందరూ పార్టీ మారడం లేదని ఎమ్మెల్యే ఉంటే ఉంటామని సభలో వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో హఫీస్ ఖాన్‌కే టికెట్ వస్తుందని తిరిగి ఆయన ఎమ్మెల్యే అవుతారని కార్పొరేటర్లు తెలిపారు.