ETV Bharat / politics

గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్​కు అధికారం ఇచ్చారు - మేం చెప్పినట్లే జరుగుతోంది : కేటీఆర్ - BRS Leaders and Activists Clash

Clash Between BRS Leaders and Activists in Kamareddy : బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. కేటీఆర్​ సమక్షంలోనే ఈ రసాభాస జరిగింది. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన బీఆర్​ఎస్​ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ktr kamareddy meeting
ktr kamareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 3:11 PM IST

Updated : Mar 10, 2024, 5:05 PM IST

Clash Between BRS Leaders and Activists in Kamareddy : కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్​ఎస్​ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)​ ముందే నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వేదిక పైకి దూసుకొచ్చిన బీఆర్​ఎస్​ కార్యకర్తలు, కామారెడ్డి బీఆర్​ఎస్​ ఇంఛార్జీ ఎవరో చెప్పాలని కేటీఆర్​ను కోరారు. వెంటనే జై గంప గోవర్ధన్​ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్​ఎస్​ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్​, ప్రశాంత్​ రెడ్డి, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో సమన్వయ కమిటీతో ముందుకు వెళ్తామని బీఆర్​ఎస్ (BRS)​ జిల్లా అధ్యక్షుడు ముజీబ్​ తెలిపారు. కామారెడ్డి సభలో మాట్లాడిన బీఆర్​ఎస్​ నేత కొమ్ముల తిర్మల్​ రెడ్డి, సభలో గంప గోవర్ధన్​ పేరును ప్రస్తావించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. సభలో ఉన్న కేటీఆర్​ చెప్పినా వినకుండా బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

కాంగ్రెస్‌ వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్‌ చేస్తోంది - వారికి ఏం చేతకాదు : కేటీఆర్​

అనంతరం బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సభను ఉద్దేశించి ప్రసంగించారు. గంప గోవర్ధన్​ నాయకత్వంలోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని అన్నారు. అసంబద్ధమైన హామీలు ఇచ్చి కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించారని మండిపడ్డారు. గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్​కు అధికారం ఇచ్చారని విమర్శలు చేశారు. డిసెంబరు 9న రూ.2 లక్షల రుణమాఫీ (Farmer Loan Waiver) చేస్తామన్నారు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని సవాల్​ విసిరారు.

"రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇది కాలం తెచ్చిన కరవు కాదు కాంగ్రెస్​ తెచ్చిన కరవు. అబద్ధపు ప్రచారాలు, అసంబద్ధ హామీలు ఇచ్చి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. మార్చి 17 వరకు వంద రోజులు నిండే దాకా ఓపికగా చూద్దాం. తర్వాత ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్​ ఇచ్చిన హామీలు అందాయా అని అడుగుదాం. దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాలనీ రేవంత్​కు సవాల్ విసురుతున్నాను. రేవంత్ మగాడైతే పంటకు బోనస్, రుణ మాఫీ, ఆడబిడ్డలకు నగదు బదిలీ చేసి చూపాలి." - కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్​కు అధికారం ఇచ్చారు - మేం చెప్పినట్లే జరుగుతోంది : కేటీఆర్

BRS Leader KTR Fires on Congress : కాంగ్రెస్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరికి రూ.500 బోనస్​ వెంటనే ప్రకటించాలని కేటీఆర్​ అన్నారు. 100 రోజులు అయ్యాక ఆడబిడ్డలు కాంగ్రెస్​ భరతం పడతారని తెలిపారు. మేడిగడ్డ (Medigadda)లో 85 పిల్లర్లు ఉంటే, 3 పిల్లర్లు కుంగాయని అన్నారు. మూడు నెలల్లో మేడిగడ్డ పిల్లర్లను బాగు చేయలేరా అంటూ సూటిగా ప్రశ్నించారు. మేం చెప్పినట్లే కాంగ్రెస్​ రాగానే కరెంటు పోయిందని ఆరోపించారు. అధికారంలో లేకపోయినా బీఆర్​ఎస్​కు కార్యకర్తల బలం ఉందని తెలిపారు.

'రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్​ఎస్​తో పొత్తు - వారంతా మా కూటమిని నిందించడం హాస్యాస్పదం'

'గోల్​మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణతో పోలికా?' - రేవంత్​పై బీఆర్​ఎస్​ విమర్శలు

Last Updated : Mar 10, 2024, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.