ETV Bharat / politics

చిత్తూరులో సైకిల్​దే జోరు - తెలుగుదేశం పార్టీకి కంచుకోట - Chittoor LOK SABHA ELECTIONS - CHITTOOR LOK SABHA ELECTIONS

Chittoor Lok Sabha Constituency : రాష్ట్రానికి దక్షిణాగ్రాన ఉన్న లోక్​సభ నియోజకవర్గం చిత్తూరు. పెన్నా నదీ లోయ పట్టణంగా దీనిని చెప్పుకోవచ్చు, ద్రవిడ ప్రాంతమైన చిత్తూరు ప్రజలు తెలుగు, తమిళం, కన్నడ భాష మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండడమే ఇందుకు కారణం. స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి చిత్తూరుకు అతి సమీపంలో ఉంది. మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ లోక్‌సభ సభాపతిగా పని చేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి కావడం గమనార్హం.

Chittoor_Lok_Sabha_Constituency
Chittoor_Lok_Sabha_Constituency
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 7:20 AM IST

Chittoor Lok Sabha Constituency : ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో చిత్తూరు ఒకటి. 1952లో ఏర్పడిన ఈ లోక్​సభ నియోజకవర్గాన్ని ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. 1957లో ఇక్కడి నుంచి గెలుపొందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ లోక్‌సభ సభాపతిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి కావడం గమనార్హం.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు : ప్రస్తుతం ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభా నియోజకవర్గాలున్నాయి.

  1. చంద్రగిరి
  2. నగరి
  3. గంగాధర నెల్లూరు
  4. చిత్తూరు
  5. పూతలపట్టు
  6. పలమనేరు
  7. కుప్పం

2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:

  • మొత్తం ఓటర్ల సంఖ్య- 16.29 లక్షలు
  • ఓటర్లలో పురుషుల సంఖ్య- 8.02 లక్షలు
  • మహిళా ఓటర్ల సంఖ్య- 8.26 లక్షలు
  • ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 136

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, రెండో స్థానంలో టీడీపీ నిలిచింది. అయితే అంతకుముందు వరకూ టీడీపీకి కంచుకోటగా ఉన్న చిత్తూరు లోక్​సభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన ఎన్​. రెడ్డప్ప తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్​పై విజయం సాధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఈ లోక్​సభ నియోజకవర్గంలో పుంజుకుని పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది.

Chittoor_Lok_Sabha_Constituency
Chittoor_Lok_Sabha_Constituency

ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు: ప్రస్తుత ఎన్నికలకు ఎన్‌.రెడ్డప్ప మరోసారి వైఎస్సార్సీపీ నుంచి సీటు దక్కించుకున్నారు. పొత్తులో భాగంగా ఈ లోక్​సభ స్థానం బీజేపీకి కేటాయించగా వరప్రసాదరావును బరిలో దింపింది.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు:

  • 1952: టి.ఎన్. విశ్వనాథ రెడ్డి (కాంగ్రెస్)
  • 1957: మాడభూషి అనంతశయనం అయ్యంగార్ (కాంగ్రెస్)
  • 1962: ఎన్.జి.రంగా (స్వతంత్ర)
  • 1967: ఎన్.పి. చెంగల్రాయుడు (కాంగ్రెస్)
  • 1971: పి.నరసింహారెడ్డి (కాంగ్రెస్)
  • 1977: పి.రాజగోపాల్ నాయుడు (కాంగ్రెస్)
  • 1980: పి.రాజగోపాల్ నాయుడు (కాంగ్రెస్)
  • 1984: ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి (టీడీపీ)
  • 1989: ఎమ్.జ్ఞానేంద్ర రెడ్డి (కాంగ్రెస్)
  • 1991: ఎమ్.జ్ఞానేంద్ర రెడ్డి (కాంగ్రెస్)
  • 1996: ఎన్.రామకృష్ణా రెడ్డి (టీడీపీ)
  • 1998: ఎన్.రామకృష్ణా రెడ్డి (టీడీపీ)
  • 1999: ఎన్.రామకృష్ణా రెడ్డి (టీడీపీ)
  • 2004: డి.కె.ఆదికేశవులు (టీడీపీ)
  • 2009: ఎన్.శివప్రసాద్ (టీడీపీ)

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:

  • 2014: ఎన్‌.శివప్రసాద్‌ (టీడీపీ)- జీ.సామాన్య కిరణ్ (వైఎస్సార్సీపీ)
  • 2019: ఎన్‌.రెడ్డప్ప (వైఎస్సార్సీపీ)- నారమల్లి శివప్రసాద్ (టీడీపీ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.