ETV Bharat / politics

'కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మంచిది' - చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి - cbn delhi tour

CM CBN Delhi Tour : రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి.. రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్తున్నానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనపై మంత్రులతో చంద్రబాబు ఏమన్నారంటే!

cbn_delhi_tour
cbn_delhi_tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 5:29 PM IST

CM Chandrababu Delhi Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్​ ప్రాజెక్టులు, ఆర్థిక ప్రోత్సాహకాలపై సీఎం కేంద్ర పెద్దలను కలిసి విన్నవించనున్నట్లు సమాచారం. ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం, రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Chandrababu Sensational Comments on Delhi Tour: "కొన్ని విషయాలు రహస్యం ఉంటేనే మంచిది" అని సీఎం చంద్రబాబు తన దిల్లీ పర్యటనపై ఆరా తీసిన మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. కేబినెట్​ సమావేశం అనంతరం మంత్రులతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలపై పలు సూచనలు చేశారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని, ప్రజల్లో అభాసుపాలు కావొద్దని ఎమ్మెల్యేలకు సైతం సందేశమిచ్చారు. దిల్లీ పర్యటన ఉద్దేశించి మాట్లాడుతూ "రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయ్.. అందుకే దిల్లీ వెళ్తున్నా.. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది" అని చెప్తూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్తున్నానని, అన్ని విషయాలు బయటకు చెప్పలేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

"దటీజ్​ చంద్రబాబు" హాట్​టాపిక్​గా దిల్లీ తొలి పర్యటన​- నాడు జగన్​ 29సార్లు - CBN Delhi Tour

కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల నిధులను సద్వినియోగం చేసుకోవడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అదే సమయంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆహ్వానంపై అధికారులతో సమీక్షలో తరచూ ఆరా తీస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా నివేదికలు ఉండాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల 5 దిల్లీలో తొలిసారి పర్యటించిన చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిశారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాలతోనూ చంద్రబాబు వరుసగా సమావేశమయ్యారు. మరుసటి రోజు మంత్రులు రాజ్​నాథ్​ సింగ్, నిర్మలా సీతారామన్, నడ్డా, నీతీ ఆయోగ్ సీఈవోలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలను చంద్రబాబు కలిశారు. మొత్తంగా రెండ్రోజుల దిల్లీ పర్యటనను ఆయన విజయవంతంగా ముగించారు.

రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుపై హోం మంత్రి అమిత్‌ షాతో సుమారు గంట సేపు సమావేశమయ్యారు. భూ సేకరణకు రూ.385 కోట్లు, నిర్వహణ వ్యయంగా రూ.27.54 కోట్లు విడుదల చేయాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్​కు ఆమోదం తెలపాలని కోరారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీలో వైజాగ్‌- చెన్నై, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవాలపై చర్చించారు. ఆక్వాపార్క్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు విన్నవించారు. కేంద్ర పట్టణాభివృద్ది, విద్యుత్‌ శాఖ మంత్రి మనోహర్ లాల్‌తో జరిగిన సమావేశంలో కర్నూలు నుంచి వైజాగ్ వరకు HVDC ISTS లైన్ కోసం ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని, అదనపు ప్రుడెన్షియల్ నిబంధనల సడలింపుకు అనుమతించాలని కోరారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్‌ పనగడియాతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర నిధులపై సహకారం కోరారు.

దిల్లీలో మారిన లెక్క - రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపైనే వరుస భేటీలు - CBN Delhi Tour

ఏపీకి తగిన సాయం అందించండి - నిర్మలా సీతారామన్​కు చంద్రబాబు విన్నపం - Chandrababu Met Nirmala Sitharaman

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.