ETV Bharat / politics

కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు చేయుత- అంబాజీపేటలో చంద్రబాబు - Chandrababu Naidu Election Campaign - CHANDRABABU NAIDU ELECTION CAMPAIGN

Chandrababu Naidu Election Campaign : ఎన్నికలు లాంఛనమే కూటమే గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.

Chandrababu_Naidu_Election_Campaign
Chandrababu_Naidu_Election_Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 7:44 PM IST

Updated : Apr 11, 2024, 8:22 PM IST

Chandrababu Naidu Election Campaign : ఐదేళ్ల వైఎస్సార్సీపీ నరకపాలనకు చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న చంద్రబాబు ప్రజాగళంకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికలు లాంఛనమేనని, కూటమిదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు.

రంజాన్ రోజున ముస్లిం మహిళలను జగన్ కంటతడి పెట్టించారు : చంద్రబాబు - Muslim Women Meet Chandrababu

మూడు జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటే : వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీల 27 పథకాలు రద్దు చేశారని, దుర్మార్గ పాలన వస్తే ఎస్సీలను చంపి డోర్‌ డెలివరీ చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం డిక్లరేషన్‌ తీసుకువస్తామని అన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు కొబ్బరి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదని, సిద్ధం సిద్ధం అంటున్న వారికి యద్ధం ఇద్దామని పవన్‌ చెప్పారని గుర్తు చేశారు. మూడు జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటేనని, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయమని అన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ తప్పుడు వీడియోలు - తెరపైకి ఫేక్​ పరిశ్రమ : చంద్రబాబు - vigilance on YCP fake videos

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు : చట్టబద్ధంగా కులగణన చేపడతామని చంద్రబాబు తెలిపారు. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. సబ్‌ ప్లాన్‌ ద్వారా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని, ఆదరణ పథకం కింద రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తామని, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతామని హామీ ఇచ్చారు.

పోలీసులకు బకాయిపడ్డ నిధులు ఇవ్వలేదు : భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి ఒక్కరే పొట్ట నింపుకుంటున్నారని, ఎక్కడ చూసినా ఇసుక మాఫియా చెలరేగిపోతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. పోలీసులకు బకాయిపడ్డ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Condemn Attack on tdp

వైఎస్సార్సీపీ నరకపాలనకు చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైంది: చంద్రబాబు

Last Updated : Apr 11, 2024, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.