ETV Bharat / politics

టీడీపీకి అనపర్తి, బీజేపీ తంబళ్లపల్లె సీట్లు - సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు! - MLA Candidates Change - MLA CANDIDATES CHANGE

TDP, Janasena, BJP MLA Candidates Change: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశముంది. పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో చేయాల్సిన ఒకటి రెండు మార్పులపై టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు శుక్రవారం చర్చించారు.

TDP, Janasena, BJP MLA Candidates Change

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 7:22 AM IST

టీడీపీకి అనపర్తి, బీజేపీ తంబళ్లపల్లె సీట్లు

TDP, Janasena, BJP MLA Candidates Change: ఉండవల్లిలోని టీడీపీఅధినేత చంద్రబాబు నివాసంలో సుమారు రెండు గంటలపాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, సిద్ధార్థనాథ్‌సింగ్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మూడు పార్టీలూ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. వాటిలో కొన్ని మార్పులపై ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది.

టీడీపీ శ్రేణుల డిమాండ్‌: అనపర్తి సీటు మార్పుతో పాటు, ఎంపీ రఘురామకృష్ణరాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి టీడీపీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని స్థానిక టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ విజ్ఞప్తి మేరకు, అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున, బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు.

నరసాపురం లోక్‌సభ స్థానం: అనపర్తికి బదులు తంబళ్లపల్లె తీసుకోవాలని ప్రతిపాదించగా, తమ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెబుతామని బీజేపీ నాయకులు అన్నట్లు తెలిసింది. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని తమకు విడిచి పెట్టాలని, అక్కడి నుంచి రఘురామకు టికెట్‌ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించి, దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని, ప్రస్తుతం నరసాపురం లోక్‌సభ స్థానం కేటాయించిన శ్రీనివాసవర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామని బీజేపీ నాయకులు చెప్పారని సమాచారం.

17 నుంచి టీడీపీ-జనసేన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు: ఎన్నికల వ్యవహారాలు, ప్రచారంపై పర్యవేక్షణ, వ్యూహాల రూపకల్పనకు మూడు పార్టీల నాయకులతో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఉమ్మడిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని, చర్యలు తీసుకునే వరకు పోరాడాలని భావించారు. రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి ఎన్నికల ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున, ఇకపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పాల్గొనే సభలకు బీజేపీ నుంచి కేంద్ర, రాష్ట్ర నాయకులెవరైనా హాజరు కావాలని నిర్ణయించారు.

వామపక్షాలతో కలిసి ప్రజా పోరాటాలు: షర్మిల

160 అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యం: ప్రధాని నరేంద్రమోదీతో పాటు, అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌ వంటి అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఉన్న అవకాశాలు, ప్రణాళికపై చర్చ జరిగింది. మూడు పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని, వైసీపీ తప్పుడు ప్రచారాలను వారు నమ్మడం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. 25 లోక్‌సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళికతో వెళ్లాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం బూత్, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.
అందరం కలిసి పనిచేద్దాం - వ్యక్తిగతం కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యం: ఆలపాటి రాజా - TDP Alapati Raja Comments

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.