Chandrababu and Pawan Joint Election Campaign: అహంకారి జగన్ విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. జైలుకు, బెయిల్‌కు మధ్య ఊగిసిలాడే జీవితం జగన్‌దన్న పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేసి జగన్‌ను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
అందాల కోనసీమను భవిష్యత్తులో బంగారు సీమగా మార్చడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా ఏర్పడినట్లు వివరించారు. కూటమికి ఎవరైనా అడ్డుగా నిలబడితే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత, వైసీపీ నేతలు దోచింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు. దళితులకు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని స్పష్టం చేశారు.
ఆడ బిడ్డలకు భద్రత కల్పించని, యువతకు ఉద్యోగాలు ఇవ్వని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించని వైసీపీ ప్రభుత్వం అవసరమా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కోనసీమలో శాంతిభద్రతలు కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కోనసీమ వాసుల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు రైలును తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.
"కోనసీమను బంగారు సీమగా చేస్తాం. ఐదేళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. అహంకారి జగన్ విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోకపోతే శాశ్వతంగా దక్కించుకోలేం. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో నంబర్ వన్‌గా మారింది. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత, వైసీపీ నేతలు దోచింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా?" - చంద్రబాబు, టీడీపీ అధినేత
"వైసీపీ నేతలు కోనసీమను కలహాల సీమగా మార్చారు. కోనసీమలో చిచ్చుపెడితే సహించేదే లేదు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాబోతోంది. కోనసీమకు రైలు రావాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. కోనసీమ వాసుల కోరికను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత