AP Election Results 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో నారా లోకేశ్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, రాజమండ్రి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ముందంజ
- రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి ముందంజ
- విజయవాడలో కేశినేని చిన్ని ముందంజ
- తెనాలిలో నాదెండ్ల మనోహర్ ముందంజ
- మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ
- పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ముందంజ
- రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ముందంజ
- రెండో రౌండ్ ముగిసేసరికి బుచ్చయ్యకు 2870 ఓట్ల ఆధిక్యం
- కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం
- ఒంగోలు టీడీపీ అభ్యర్థి 2760 ఓట్ల ఆధిక్యంలో దామచర్ల జనార్దన్
- విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ ముందంజ
- విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి ముందంజ
- పొన్నూరులో టీడీపీ అభ్యర్థి 2170 ఓట్ల ఆధిక్యంలో ధూళిపాళ్ల నరేంద్ర
- చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ముందంజ
- తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ముందంజ
- పిఠాపురంలో పవన్‌కల్యాణ్ ముందంజ
- రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజ
- జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముందంజ
- పొన్నూరులో తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్రకు 6,445 ఓట్ల ఆధిక్యం
- గురజాలలో తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి యరపతినేనికి 1,311 ఓట్ల ఆధిక్యం
- బాపట్లలో తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు 1,394 ఓట్ల ఆధిక్యం
- మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తొలి రౌండ్‌లో 1,034 ఓట్ల ఆధిక్యం
- మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 1,000 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్ ముగిసేసరికి తెనాలిలో నాదెండ్ల మనోహర్‌కు 7,885 ఓట్ల ఆధిక్యం
- పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు తొలిరౌండ్‌లో 1,500 ఓట్ల ఆధిక్యం
- విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరికి 2 వేల ఓట్ల ఆధిక్యం
- పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితకు తొలిరౌండ్‌లో 2,365 ఓట్ల ఆధిక్యం
- జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్‌కు తొలిరౌండ్‌లో 857 ఓట్ల ఆధిక్యం
- పులివెందులలో తొలిరౌండ్‌లో సీఎం జగన్‌కు 1,888 ఓట్ల ఆధిక్యం
- పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితకు తొలిరౌండ్‌లో వెయ్యి ఓట్ల ఆధిక్యం
- కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డికి తొలిరౌండ్‌లో 665 ఓట్ల ఆధిక్యం