CEC Clarification on Postal Ballot Vote Counting : పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 13 A ఫాంపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఈసీ స్పష్టం చేసింది. సదరు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది వాటిని చెల్లుబాటు అయ్యే ఓటుగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి ధృవీకరణ తరవాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13 Aపై సంతకం చేశారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాసింది.
ఈసీ నింధనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైస్సార్సీపీ నేతలు: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు నిబంధనలు సడలింపుపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు జారీ చేశారని, గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారని, స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈసీ నిబంధనల వల్ల ఓటు గోప్యత ఉండదన్నారు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారని వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆందోళనల నేపథ్యంలో ఈసీ మరోసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై స్పష్టతనిచ్చింది.
4వ తేదీ ఎడవాల్సిన ఏడుపులు ఇప్పుడే ఏడుస్తున్నారు: టీడీపీ - TDP leader Devineni Uma Comments
అందుకోసమే వైఎస్సార్సీపీ ఆందోళన: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకుగానూ, 3.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల 12- డి ఫారాలు అందడంలో జాప్యం జరిగింది. అయితే వారికోసం కొంత గడువు కూడా సీఈఓ ఇచ్చారు. అయితే, ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులు టీడీపీకి అనుకులంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు - YSRCP complaint to EC