ETV Bharat / politics

చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ఎర్రచందనం కేసులు - పెద్దారెడ్డిపై క్రిమినల్​ కేసులు - Cases on YSRCP MLA Candidates - CASES ON YSRCP MLA CANDIDATES

Cases on YSRCP MLA Candidates: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్‌ గురువారం విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారిపై ఉన్న కేసుల వివరాలు, ఆస్తులు, అప్పులు వివరాలు అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

Cases on YSRCP MLA Candidates
Cases on YSRCP MLA Candidates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 9:05 AM IST

Cases on YSRCP MLA Candidates : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్‌ గురువారం విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారిపై ఉన్న కేసుల వివరాలు, ఆస్తులు, అప్పులు వివరాలు అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

YSRCP MLA Candidates Affidavit : చిత్తూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులు ఉన్నాయి. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం కల్తీ మద్యం సరఫరాపై మరో కేసు ఉంది. 2019లో పీడీ చట్టం కింద రాజమహేంద్రవరం జైలుకెళ్లారు. చిత్తూరు, బంగారుపాళ్యం, కేవీ పల్లె, గుడిపాల, ఎస్‌ఆర్‌ పురం, పీలేరు, గంగాధర నెల్లూరు, పెనుమూరు స్టేషన్‌లలో అతనిపై అటవీ సంపదను దొంగిలించడం, అక్రమంగా రవాణా చేయడం, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి కేసులున్నాయి. బంగారుపాళ్యం ఠాణాలో హత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు ఉంది. విజయానందరెడ్డి భార్య పేరిట 37.04 కోట్ల రూపాయలు చరాస్థులు, 18.89 కోట్ల రూపాయల స్థిరాస్తులున్నాయి. అప్పులు 19.84 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.

ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ - తొలి రోజు 229 దాఖలు - Leaders filed nominations

కేతిరెడ్డి పెద్దారెడ్డి : తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 5 క్రిమినల్‌ కేసులున్నాయి. 2020లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి మారణాయుధాలతో చొరబడిన ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఒక ఎస్సీ, ఎస్టీ కేసు ఉంది. కేతిరెడ్డి పేరిట 76 లక్షల రూపాయల చరాస్తులు, 35 లక్షల రూపాయల స్థిరాస్తులు, 2.46 కోట్ల రూపాయల అప్పు, భార్య పేరిట రూ.1.49 కోట్ల చరాస్తులు, రూ.13 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2019 ఎన్నికల అఫిడవిట్‌లో 7 క్రిమినల్‌ కేసులున్నట్లు చూపించగా, తాజాగా ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని తెలిపారు. 2018లో బత్తలపల్లి ఠాణాలో ఆయనపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. 147, 148, 324, 151, 355, 509 తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నీ కొట్టివేసినట్లు అఫిడవిట్‌ను బట్టి స్పష్టమవుతోంది.

దద్డాల నారాయణ : ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి దద్డాల నారాయణపై 420, 506 సెక్షన్లతో సహా పలు కేసులు నమోదయ్యాయి. తన పేరిట రూ.70.33 లక్షలు, భార్య మంజుభార్గవి పేరుతో రూ.62.03 లక్షల ఆస్తులున్నట్లు చూపారు.

తొలిరోజు జోరుగా నామినేషన్ల ప్రక్రియ - భారీ ర్యాలీలతో తరలివస్తున్న నేతలు - ELECTION NOMINATIONS

రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి : నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కల్తీ మద్యం కేసుల్లో నిందితుడని ఆయన సమర్పించిన అఫిడవిట్‌ చెబుతోంది. ఆయనపై మొత్తం ఏడు కేసులుండగా, ఆరు కల్తీ మద్యానికి సంబంధించినవే. 2014 ఎన్నికల వేళ ఆయన ఓటర్లకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు కేసులు నమోదయ్యాయి. రామిరెడ్డి దంపతులకు రూ.236.98 కోట్ల స్థిర, చరాస్తులుండగా, రూ.50.95 కోట్ల అప్పులున్నాయి. అతని పేరిట రూ.2.63 కోట్ల విలువైన 8 కార్లు, అతని భార్య పేరిట రూ.1.33 కోట్ల విలువైన మూడు కార్లు ఉన్నాయి.

కేఏ పాల్‌ : విశాఖ లోక్‌సభ స్థానానికి ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, మహబూబ్‌నగర్‌, ఎల్‌.కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులున్నాయి. పాల్‌ పేరిట మొత్తంగా రూ.1.86 లక్షల సొమ్ము ఉంది. వాహనాలు, స్థిరాస్తులు, రుణాలు లేవు. డిగ్రీ రెండో ఏడాదిలోనే చదువు ఆపేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి దాఖలైన తొలి నామినేషన్ - రాయదుర్గంలో ఎన్నికల బరిలో నిలిచిన చిన్నప్పయ్య - congress party first NOMINATION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.