ETV Bharat / politics

విశాఖలో మీడియాపై కేసులు- 'బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకే' - Police Cases against media - POLICE CASES AGAINST MEDIA

Police Cases against media persons : బాధితుల తరఫున గళం వినిపించి వారికి తగిన న్యాయం చేసేందుకు సమాజాన్ని మీడియా మేల్కొల్పుతుంది. కానీ, కొందరు వారి స్వార్థం కోసం బాధితల గొంతైన మీడియాని అణచివేయాలని చూస్తున్నారు. ఇటీవల విశాఖలో ఓ బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు టీవీ ఛానళ్లపై కేసులు పెట్టడమే దానికి నిదర్శనం. అధికార పక్ష నేతల దాడిపై అన్యాయాన్ని వివరించినందుకు వర్గాల మధ్య శతృత్వం పెంచారని చెప్పడం విడ్డూరంగా అనిపించింది. బాధితుల గొంతు వినిపించడం నేరమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Etv Bharat
police_cases_against_media (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 2:06 PM IST

Police Cases against media persons : "పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే" రమేష్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పత్రికా స్వేచ్ఛ కూడా రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్య్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంలో పత్రికలది అత్యంత కీలక పాత్ర. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే. కానీ రాష్ట్రంలో మాత్రం పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోంది.

విశాఖలో వైసీపీ నేత దాడి ఘటనలో- బాధితుల మీడియా సమావేశం - YCP Attack A Family in Visakha

ఎన్​డీఏ అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరం అవుతుందా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్‌ చేయడం వర్గాల మధ్య శతృత్వం పెంచడం ఎల్ అవుతుంది? ఇది నేరపూరిత కుట్రగదా పరిగణించాలా? బాధితుల ఆవేదనను ఛానెళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా? బర్మా కాలనీకి సంబంధించిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. వారి ఆవేదనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్‌ ప్రతినిధులపై, వారితో కలిసి మీడియాతో మాట్లాడినందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు C.R.P.C. 91 సెక్షన్ల కింద నోటీసులిచ్చారు.

ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనపై మొత్తం రీ ఇన్వెస్టిగేట్‌ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసును విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు పరిధిలోకి ఈ కేసును తీసుకురావాలని కోరుతున్నాయి. కంచరపాలెం పోలీసులు తమను లంచం అడిగారని బాధితులు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. దీనిపై విశాఖపట్నం పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? ఈ అంశంపై కూడా దర్యాప్తు చేయాలని, దీన్ని సిట్‌ పరిధిలోకి తీసుకురావాలని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలపై విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

'కేసు పెట్టకూడదంటే 2 లక్షలు ఇవ్వాలి'- బాధితులకు పోలీసుల ఆఫర్​ - YSRCP Leaders Attack on Family

ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి.. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రిల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు ఏ మాత్రం తీసిపోదని చెప్తున్న ప్రతిపక్షాలు ఈ ఘటనను సైతం ఎన్నికల హింస కిందే పరిగణించాలంటూ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, పోలీసులు మాత్రం ఇది ఎన్నికల హింస కాదని చెప్పేందుకే తాపత్రయపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన రోజున భయభ్రాంతులకు గురై ఆందోళనలో ఉన్న బాధితులు ఆ సమయంలో వారు ఏం చెప్పారో, పోలీసులు ఏం రాసుకున్నారో ఎవరికీ తెలీదు. కానీ, అదేదో కుటుంబ గొడవలు అన్నట్లుగా పోలీసులు తేల్చేశారని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా తమ మీద న్యూసెన్స్‌ కేసు పెట్టకూడదంటే 2 లక్షల లంచం ఇవ్వాలని కంచరపాలెం పోలీసులు డిమాండ్ చేశారని బాధితులే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

"పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే " రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ కూడా భాగమే. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంలో పత్రికలు కీలక భూమిక పోషిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే- రమేష్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

కొత్తూరులో రెచ్చిపోయిన వైఎస్సార్​సీపీ మూకలు - మహిళలపై విచక్షణారహితంగా దాడి - YCP Activists Attack TDP Families

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.