BRS MP Candidate Vinod Election Campaign : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయపు నడకలో భాగంగా ప్రజలను కలిసి గతంలో తన పదవీ కాలంలో కరీంనగర్ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరించారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం తనకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు (Lok Sabha Election Campaign). తాను ఎంపీగా ఉండి పార్లమెంటు అభివృద్ధితో పాటు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కరీంనగర్ నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమిస్తానని హామీ ఇచ్చారు.
Vinod Kumar Fires on Congress : గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను వినోద్ కుమార్ ప్రజలకు వివరించారు. ఓటు వేసే ముందు ఈ అభ్యర్థి మనకు మంచి చేయగలడా లేదా అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించాలని సూచించారు. పదవుల కోసం ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా మళ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. వంద రోజుల్లో కాంగ్రెస్ తన హమీలను పూర్తిగా అమలు చేయలేదన్నారు.
ప్రచారాలతో హెరెత్తిస్తున్న బీఆర్ఎస్ - ఉగాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలు - Lok Sabha Elections 2024