BRS MLA Harish Rao Fires on CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రైవేటు ఉపాధ్యాయుులకు వేతనాల్లో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయులను తక్కువ చేసి మాట్లాడడం తగదన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా ట్రష్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సగటు ఆదాయం తక్కువగా ఉన్న బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు నిధులను కేటాయించడం వల్ల, సగటు ఆదాయం ఎక్కువగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నష్టపోవడం జరుగుతోందని హరీశ్‌రావు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడంతో ఇక్కడ జనాభా తగ్గిందని అన్నారు. అదే ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించకపోవడంతో జనాభా పెరిగిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు : అలాగే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనతో, పార్లమెంటులో దక్షిణ భారతదేశం ప్రాధాన్యత తగ్గనుందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బెస్ట్ అవెలెబుల్ స్కూల్స్‌కి ప్రభుత్వం 10 నెలలు అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు.
"ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల ఆరోగ్య బీమా చేయించాను. బెస్ట్ అవెలెబుల్ స్కూల్స్‌కు ప్రభుత్వం 10 నెలలు అయినా రూపాయి ఇవ్వలేదుు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరం. ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలరీలో వ్యత్యాసం ఉన్నా సామర్థ్యంలో లేదు. ఇలా వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం సీఎంకు తగదు." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా? - ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్