ETV Bharat / politics

బీఆర్ఎస్, బీజేపీ దోస్తులైతే కవిత జైల్లో ఎందుకుంటుంది? - వాళ్లను నమ్మి మళ్లీ మోసపోవద్దు : కేటీఆర్ - KTR ON BRS BJP FRIENDSHIP RUMORS - KTR ON BRS BJP FRIENDSHIP RUMORS

KTR Fires On Congress and BJP : బీజేపీ పోటీ చేసేదే 420 స్థానాల్లో అయితే 400 సీట్లు వస్తాయా? అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే కవితను ఎందుకు జైళ్లో వేస్తారని అడిగారు. కాంగ్రెస్, బీజేపీలోని వలస పక్షులకు ఓటు వేస్తే స్థానికంగా ఉండరని, ఎన్నికలకు కాగానే ఎగిరిపోతారని ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

KTR Fires On Congress BJP
KTR Fires On Congress BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 1:43 PM IST

Updated : Apr 24, 2024, 2:11 PM IST

బీఆర్ఎస్, బీజేపీ దోస్తులైతే కవిత జైల్లో ఎందుకుంటుంది? - వాళ్లను నమ్మి మళ్లీ మోసపోవద్దు : కేటీఆర్

KTR Fires On CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ప్రజల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ప్రజలు ఎంపీనీ, పీసీసీ అధ్యక్షుడ్ని, ముఖ్యమంత్రిని చేస్తే రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం పార్లమెంటులో మల్కాజిగిరి ఊసే ఎత్తలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ సందర్భంగా శామీర్​పేట వద్ద నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.

KTR Comments ON PM Modi :గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 5 వేల ఓట్లతో ఓడిపోయిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలోని వలస పక్షులకు ఓటు వేస్తే స్థానికంగా ఉండరని, అందుకే పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 నుంచి 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోనే కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునఃనిర్మించిన కేసీఆర్ దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.

'కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది - నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది' - KTR Tweet On Congress

దేశంలో రూ.400 ఉన్న సిలిండర్​ను మోదీ రూ.1200కు పెంచారు. సెంటిమెంట్​కు పోయి ఓట్లు వేస్తే ఆగం అవుతాం. బీజేపీ పోటీ చేసేదే 420 సీట్లలో అయితే 400 సీట్లు వస్తాయా? బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే కవితను జైళ్లో ఎందుకు వేస్తారు. పదేళ్లలో మల్కాజిగిరికి బీజేపీ ఏం చేసింది. కేసీఆర్ 36 వంతెనలు కడితే ఉప్పల్, అంబర్​పేట్​లో బీజేపీ రెండు వంతెనలు కూడా కట్టలేకపోయింది. యూపీలో బీజేపీపై పోరాడలేక రాహుల్ కేరళకు పారిపోయారు. కాంగ్రెస్, బీజేపీని నమ్మి ప్రజలు రెండోసారి మోసపోవద్దు. - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని : మోదీ అక్షింతలు పంపిస్తే కేసీఆర్ దేశం మొత్తానికి బియ్యం పంపించారని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం లేదనే బాధ ప్రజల్లో ఉందని, ఆయనను బతిమిలాడుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. మల్కాజిగిరిలో వలస పక్షులైన ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల తర్వాత కనిపించరని తెలిపారు.' ఒకసారి వాళ్లు మిమ్మల్ని మోసం చేశారు, రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుంది. అందుకే బీఆర్ఎస్​కు ఓటువేసి గెలిపించండి' అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

లోక్​సభ ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లలో గెలిపిస్తే - రాజకీయంగా చాలా మార్పులు తీసుకొస్తాం : కేటీఆర్ - KTR Interesting Comments

అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది - మరోసారి మోసానికి తెరలేపింది : కేటీఆర్‌ - KTR ROAD SHOW IN RAJENDRANAGAR

Last Updated : Apr 24, 2024, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.