ETV Bharat / politics

తెలంగాణలో బీజేపీ అగ్రనేత ప్రచారం - ఈనెల 8,10 తేదీల్లో ప్రధాని రాక - BJP ELECTION CAMPAIGN IN TELANGANA - BJP ELECTION CAMPAIGN IN TELANGANA

PM Modi Election Campaign in Telangana : తెలంగాణ లోక్‌సభ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వరుసపెట్టి రోడ్‌షోలు, బహిరంగ సభలతో రాష్ట్రాన్ని దద్దరిల్లిస్తున్నారు. వరుస పెట్టి పర్యటనతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు.

bjpElection Campaign in Telangana
PM Modi Election Campaign in Telangana (etv bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 10:31 PM IST

BJP Leaders Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికల వేడితో రాష్ట్రం భగభగ మండుతోంది. అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రాన్ని రాజకీయ రణరంగంగా మార్చేశారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానం అగ్రనేతలతో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. ప్రచారానికి సమయం దగ్గరపడుతుండటంతో అగ్రనేతలు ఇక్కడ పాగా వేశారు. తమ ప్రసంగాలతో ప్రజలను హోరెత్తించనున్నారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేడీ నడ్డా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పుడు ఆ షెడ్యూల్‌ ఇదే.

ఈనెల 8,10 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 8వ తేదీన వేములవాడలో ఉదయం 9 గంటలకు జరగనున్న బహిరంగ సభకు ప్రధాని హాజరుకానున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు వరంగల్‌ జిల్లా మడికొండలో జరగనున్న బహిరంగ సభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట జిల్లాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలతో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై బీజేపీకి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.

ఆదిలాబాద్‌లో అమిత్‌ షా బహిరంగ సభ : మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 5న మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్నాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో జరగనున్న బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

భువనగిరి, నల్గొండ బహిరంగ సభల్లో పాల్గొననున్న నడ్డా : అలాగే ఈనెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు పెద్దపల్లి, మధ్నాహ్నం 1 గంటకు భువనగిరి, సాయంత్రం 3.30 గంటలకు నల్గొండలో జరగనున్న బహిరంగ సభల్లో నడ్డా పాల్గొననున్నారు.

'తెలంగాణలో డబుల్​ ఆర్​ ట్యాక్స్​ వసూలు చేసి దిల్లీకి కప్పం కడుతున్నారు' - Modi MP Election Campaign in Medak

బెంగళూరు కేఫ్​లో బాంబు పేలలేదు- కాంగ్రెస్ మైండ్ పేలింది: మోదీ - PM Modi Attack On Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.