ETV Bharat / politics

'పాంచ్ పటాకా' కూటమి ధమాకా! - వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకతకు ఐదు కారణాలివే - Who will win in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 1:13 PM IST

Who will win in AP : అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రజలు రగిలిపోయారు. అవకాశం కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న సంకల్పంతో కూటమి నిర్మాణం, పోలవరం, రాజధాని బాధ్యత తీసుకుంటామన్న కేంద్ర పెద్దల హామీలకు తోడు మూడు పార్టీల శ్రేణులు పొత్తు ధర్మం పాటిస్తూ కలిసి సాగుతున్న తీరు వైఎస్సార్సీపీ నేతల్లో చెమటలు పట్టిస్తోంది.

who_will_win_in_ap
who_will_win_in_ap (Etv bharath)

Who will win in AP : హోరాహోరీ ఎన్నికల్లో పలు పరిణామాలు కూటమి విజయం ఖాయమని చాటుతున్నాయి. ఇప్పటికే కేంద్రం నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీపై ప్రజల్లో ఆగ్రహం ఉందని తేలగా మరో ఐదు బలమైన కారణాలు ఏపీలో మార్పు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వారి అనుచరుల అరాచకాలు, మరోవైపు గత ఎమ్మెల్యేలకు స్థానచలనం అధికార పార్టీకి వ్యతిరేకం కాగా, కూటమి అభ్యర్థులపై సానుభూతి, అభివృద్ధి ఆకాంక్ష ప్రజలను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మెజార్టీ ప్రజల అవసరాలు తీర్చేలా, ఆకాంక్షలు నెరవేర్చేలా రూపొందించిన మ్యానిఫెస్టో మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇక పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వగా, ప్రతిపక్ష ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీల శ్రేణులు ఉమ్మడిగా సాగుతున్న తీరు కూటమి విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టమవుతోంది.

టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆడపడుచు ఆసక్తి - Free bus For Women

అధికార పార్టీ నేతల ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు

ఐదేళ్ల జగన్​ పాలనలో అధికార పార్టీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పల్లెల్లో ఫ్యాక్షన్ వాతావరణం విస్తరించింది. చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ఇక ఇసుక దందా, మట్టి తరలించుకుని స్థానికులపై దాడులకు తెగబడ్డారు. బీసీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆయా సంఘాల నాయకులు వాపోయారు. దళిత ఉద్యోగుల హత్యలు, దాడులు, విద్యార్థిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన ఉదంతాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో అధిష్ఠానం మార్పులు, బదిలీలకు శ్రీకారం చుట్టింది.

'చంద్రబాబుతో అమిత్​షా ఏమన్నారంటే!'- 'నెటిజన్ల స్పందన ఇదీ' - Hello AP Bye Bye YCP

కూటమి అభ్యర్థులపై సానుభూతి, అభివృద్ధిపై ఆకాంక్ష

కూటమి అభ్యర్థులపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యలపై గొంతెత్తిన టీడీపీ, జనసేన నేతలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన వైనాన్ని జనం ఇంకా మర్చిపోలేదు. చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు, అన్నా క్యాంటీన్లను ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధాని పూర్తవుతుందని, పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకుంటాయని జనం విశ్వసిస్తున్నారు.

జగన్​ భూ దాహానికి ముసుగు ​చట్టం - ఆ లక్షల ఎకరాలు ఎవరి ఖాతాలోకి? - AP LAND TITLING ACT 2023

ప్రజల అవసరాలు తీర్చేలా ప్రజాకర్షక మ్యానిఫెస్టో

రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలతో రూపొందించిన ప్రజాకర్షక మ్యానిఫెస్టో కూటమి విజయానికి పునాది వేస్తుందనడంలో సందేహం లేదు. కూటమి మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం లభిస్తోంది. బాబు ష్యూరిటీ- భవిష్యత్​ గ్యారెంటీ, పూర్​ టు రిచ్​ తో పాటు సూపర్​ సిక్స్​ పథకాలతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు ఆదాయం, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్​ సిలిండర్లు, మహాశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ప్రతి నెలా 1500 రూపాయల అందజేత, విద్యార్థులకు ప్రత్యేకంగా ఏటా నగదు అందజేత పథకాలు జనాదరణ పొందుతున్నాయి.

వైఎస్సార్సీపీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారు - ఇక చరమగీతం పాడుతారు: పురందేశ్వరి - BJP Chief Purandeswari Interview

పోలవరం, రాజధాని నిర్మాణానికి మోదీ హామీ

రాష్ట్ర విభజనాంతరం రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రజలు ఆశలు పెట్టుకున్నాకు. ఆ రెండింటి నిర్మాణాన్ని తొలి ప్రభుత్వం టీడీపీ చేపట్టగా, వైఎస్సార్సీపీ అస్సలు పట్టించుకోలేదు. తాజా ఎన్నికల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అమరావతి రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని కేంద్ర మంత్రి అమిత్​ షా హామీ ఇచ్చారు. ఏపీలో డబుల్​ ఇంజన్ సర్కారు ఖాయమని రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ జీవో ఎందుకు ఇచ్చారు- సజ్జలకు పవన్ కల్యాణ్ సూటిప్రశ్న - Pawan Kalyan Election Campaign

పొత్తు ధర్మంలో కలిసి సాగుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశం అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్​ కళ్యాణ్ తీసుకున్న చొరవ అంతా ఇంతా కాదు. తమ పార్టీ పోటీ చేసే స్థానాలను తగ్గించుకుని మరీ బీజేపీని కలుపుకొన్నారు. పొత్తు ధర్మం పాటిస్తూ మూడు పార్టీల శ్రేణులు ఏకమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రధాని సమావేశమైనా, చంద్రబాబు ప్రజాగళం సభలైనా, పవన్​ కళ్యాణ్ ర్యాలీలైనా సరే మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి నడుస్తున్న తీరు అధికార పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తోంది.

అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారా?- జగన్‌ మానసిక పరిస్థితి ఆందోళనకరం : షర్మిల - YS Sharmila vs CM Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.