BJP Parliament Clusters Meetings 2024 : కేంద్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా నిర్దేశించుకున్న భారతీయ జనతా పార్టీ (Telangana BJP) అందుకు అనుగుణంగా రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలుపొందాలనే కృతనిశ్చయంతో పనిచేస్తోంది. పది సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకు కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఒక క్లస్టర్‌గా, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, భువనగిరి పార్లమెంట్ స్థానాలను మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది.
Amit Shah Telangana Tour 2024 : మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ స్థానాలతో మూడో క్లస్టర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ కలిపి నాలుగో క్లస్టర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, కరీంనగర్ కలిపి ఐదో క్లస్టర్‌గా విభజించారు. ఈ ఐదు పార్లమెంట్ క్లస్టర్లకు రాష్ట్ర నాయకత్వం ఇంఛార్జ్‌లను నియమించింది. పార్లమెంట్ క్లస్టర్ల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతం, లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇంఛార్జ్‌లు పనిచేయనున్నారు.
వ్యూహం అంటే ఇది కదా- సీఎంల ఎంపికలో మోదీ, షా మార్క్- '2024లో అధికారం బీజేపీదే!'
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. తొలుత మహబూబ్‌నగర్ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్ర మోదీ సాహోసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని ప్రతీ గడపకు చేరవేసేలా కార్యకర్తలు పనిచేయాలని అమిత్ షా వివరించనున్నారు.
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఐదు క్లస్టర్‌లు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహబూబ్‌నగర్‌కు వస్తున్నారు. కస్టర్ సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ అవుతారు. - డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం: అమిత్ షా
BJP Focus on Lok Sabha Elections 2024 : కరీంనగర్ సమ్మేళనం తర్వాత అమిత్ షా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే మహిళా మేధావుల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కీలక ప్రచారాస్త్రంగా భావిస్తున్న కమలం పార్టీ ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేలా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయండి : అమిత్ షా
'వర్గ విభేదాలు వదిలి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కండి' - రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా వార్నింగ్