BJP National Leaders Meet TDP Chief Chandrababu: రాష్ట్రంలో ఉమ్మడి ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ ముఖ్య నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ సంయుక్త కార్యదర్శి శివ్ ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఎన్నికల బరిలో ముఖ్యమంత్రుల వారసులు - వాళ్లు ఎవరో తెలుసా? - AP ELECTIONS 2024
నామినేషన్ల ప్రక్రియ కూడా నేటితో ముగుస్తున్నందున ఉమ్మడి ప్రచారాన్ని వేగవంతం చేసేలా ప్రణాళిక రూపొందించుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఉమ్మడి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నందున బీజేపీ అగ్రనాయకత్వం కూడా ప్రచారశైలి ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతోపాటు ప్రధాని మోదీ పర్యటనపై కూడా చర్చించినట్లు సమాచారం. ప్రధానితో కలిసి చంద్రబాబు, పవన్ ఎక్కడెక్కడ సభల్లో పాల్గొనాలి, సభల నిర్వహణ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. చిలకలూరిపేట సమీపంలో బొప్పూడి వద్ద జరిగిన తొలి ఉమ్మడి సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినప్పటికీ ప్రధాని మోదీ ప్రసంగానికి మైక్ ఆటంకాలు, రాష్ట్ర ప్రజలు ఆశించిన స్థాయిలో మోదీ హామీలు లేవనే అభిప్రాయం ఉన్నందున మలి సభలు వాటన్నింటినీ అధిగమించేలా జరపాలని నిర్ణయానికి నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి తరఫున ప్రకటించాల్సి ఉన్న ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే హామీలపైనా నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.
జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి - ఈ సారి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు - Chandrababu Speech