ETV Bharat / politics

'కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు రూ.50 వేల కోట్లు - సీఎం రేవంత్​ చదివింది ఏడో తరగతే - అందుకే అర్థం కావట్లేదు' - Raghunandan Rao on Revanth Reddy

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 6:22 PM IST

Updated : Jul 27, 2024, 6:33 PM IST

Raghunandan Rao Criticizes CM Revanth : సీఎం రేవంత్​ చదివింది ఏడో తరగతని, చేసే పని గోడలకు వేసే సున్నమని, అలాంటి వాళ్లకు బడ్జెట్​ అర్థం కాదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. చదువుకున్నోళ్లను పక్కన పెట్టుకుంటే, బడ్జెట్​ అర్థమవుతుందని, కేంద్ర బడ్జెట్​నే సమస్యగా చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

BJP MP Raghunandan Rao on CM Revanth
Raghunandan Rao Criticizes CM Revanth (ETV Bharat)

BJP MP Raghunandan Rao on CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చదువుకున్నది ఏడో తరగతని, ఆయన చేసే పని గోడలకు వేసే సున్నమని, అలాంటి వాళ్లకు బడ్జెట్​ అర్థం కాదని మెదక్​ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కొంచెం చదువుకున్నోళ్లను పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్​లో తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. మెదక్​లో​ని బీజేపీ కార్యాలయంలో శనివారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేతో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర బడ్జెట్​లోని అంశాలను వివరించారు.

తెలంగాణకు కేంద్రం రెండు పథకాల కింద రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర బడ్జెట్​ కాపీలోని 4వ పేజీలో ఉందని రఘునందన్ రావు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. దీన్ని ఆధారంగా బడ్జెట్​పై సీఎం రేవంత్​కు ఎంత అవగాహన ఉందో అద్దం పడుతోందన్నారు. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లను ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి ఇస్తారే తప్ప వేరేది కాదని ఆరోపించారు.

'రేవంత్​రెడ్డి చదువుకున్నది ఏడో తరగతి. చేసే పని గోడలకు వేసే సున్నం. అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదు. కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్​లో ఏం వచ్చిందో తెలుస్తుంది. కేంద్రమంత్రి రాందాస్ అథావాలే తెలంగాణకు ఏ పథకాల్లో ఎన్ని నిధులు వచ్చాయో వివరించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్​లో 4వపేజీలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు రెండు పథకాల కింద రూ.50 వేల కోట్లు నిధులు వస్తున్నట్లు ఉంది' - రఘునందన్ రావు, మెదక్ ఎంపీ

సీఎం రేవంత్​ చదివింది ఏడోతరగతి - ఈయనకు బడ్జెట్​ అర్థంకాదు : ఎంపీ రఘునందన్ రావు (ETV Bharat)

సమస్య ఏం దొరకడం లేదనే దీనినే సమస్యగా : బీజేపీపై బురదజల్లి, బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన కాంగ్రెస్​కు కొన్ని ఓట్లు పెరుగుతాయేమో గానీ, బీజేపీకి మాత్రం పోయేదేం లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి సమస్య ఏం దొరకడం లేదనే దీనినే సమస్యగా చేస్తున్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం వచ్చినా రాకున్నా రాష్ట్రానికి వచ్చే వాటా వస్తుందన్నారు. సబ్​ కా సాత్, సబ్ ​కా వికాస్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్​లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.

డీజీపీని కలిసిన బీజేపీ నేత రఘునందన్​రావు - వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు - BJP Raghunadan rao Meets DGP

అధికారంలో ఉన్నప్పుడు చేయని రుణమాఫీ గురించి హరీశ్​రావు మాట్లాడటం అర్ధరహితం : రఘునందన్​ రావు - Raghunandan Rao Slams Harish Rao

Last Updated : Jul 27, 2024, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.