BJP MP Laxman Slams Congress : రేవంత్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ కొత్త నాటకానికి తెర లేపారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తనపై కుట్ర జరుగుతోందని ప్రజల సానుభూతి పొందేందుకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదన్న ఆయన తెలంగాణ రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉందని తెలిపారు. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆ భద్రతా భావం కనిపిస్తోందని అన్నారు.
సానుభూతి వ్యాఖ్యలు అర్థం చేసుకోండి: రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. లోక్సభ ఎన్నికల్లో వంద రోజుల పాలనను రెఫరెండంగా తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారన్న ఆయన, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. వారిచ్చిన హామీలు, గ్యారంటీలు అటకెక్కించి పార్లమెంట్ ఎన్నికలతో (Lok Sabha Elections 2024) ముడిపెట్టడం వల్ల అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు, సానుభూతి పొందేందుకు తనపై కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సానుభూతి వ్యాఖ్యలు దేనికి సంకేతమో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్
"మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు వీహెచ్. కాంగ్రెస్ పార్టీ నాయకులే వారి ప్రభుత్వాన్ని కూల్చుకుంటే తమకు సంబంధం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మజ్లిస్ రహస్య సంధి కుదురుస్తోంది. బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుంది. ఓడిపోయినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదు. అవకాశవాద రాజకీయాలను ప్రజలు గ్రహించి తగిన బుద్ది చెప్పాలి. ఎంపీ అభ్యర్థులను మార్చే ఆలోచన లేదు. త్వరలోనే కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటిస్తాం. విజయం సాధిస్తాం." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
BJP Candidates Election Campaign : లోక్సభ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారన్న ఆయన పల్లెల్లో సైతం ఈ సారి ఓటు మోదీకే అంటూ పండు ముసలి వాళ్లు కూడా చెబుతున్నారని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారని అన్నారు.