ETV Bharat / politics

విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్‌ - Laxman about MP Elections

BJP MP Laxman Comments on BRS and Congress : కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లు ఓర్వలేక తమ పార్టీపై దుష్ప్రచారం చేసున్నాయని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్​ మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు.

BJP MP Laxman on Vijay Sankalp Yatra BJP MP Laxman on Vijay Sankalp Yatra
BJP MP Laxman Comments on BRS and Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 1:15 PM IST

BJP MP Laxman Comments on BRS and Congress : బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్​ అన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లు జీర్ణించుకోలేక తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలపై ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అసైన్డ్​ భూముల్ని బడా బాబులకు అప్పగించిందని, ప్రస్తుత సర్కార్​ దానిపై ఎందుకు స్పందించడం లేదన్నారు.

దేవాలయ భూముల కోసం బీజేపీ ఉద్యమం చేస్తుందని ఎంపీ లక్ష్మణ్​ చెప్పారు. రైతు రుణమాఫీపై ఇప్పటి వరకు ఎందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ఎంఎంటీఎస్(MMTS) రెండో ఫేస్​ను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం, గిరిజన వర్సిటీ, రైల్వేలు, జాతీయ రహదారుల కోసం మోదీ ప్రభుత్వం రూ.వేల కోట్లు నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు.

BJP MP Laxman on Vijay Sankalp Yatra : ఈరోజు వరకు విజయ సంకల్ప యాత్ర 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి అయిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. దేశం కోసం మోదీ(Modi), మోదీ కోసం తాము అని ప్రజలు అంటున్నారని చెప్పారు. దివ్యమైన రామాలయం కట్టిన మోదీని తాము ఎలా కాదంటామని ప్రజలు అంటున్నారన్నారు. మోదీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగిందని సర్పంచ్​లు సైతం చెప్పారన్నారు. ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఈ రెండు పార్టీలు కూడా తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్​ఎస్​లు పొత్తు అని అసత్య ప్రచారం చేస్తున్నాయి. మేం ఎవరితోనూ పొత్తు పెట్టుకోము. దేశం కోసం మోదీ, మోదీ కోసం మేము అని ప్రజలు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంటుంది.' -కె. లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు

సంకల్ప యాత్రతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్‌

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై లక్ష్మణ్ స్పందించారు. ఆమె అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

హమీల అమలుపై పరాభవానికి ఇప్పటి నుంచే సిద్ధం కండి : నిరంజన్‌రెడ్డి

రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తా : కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.