BJP MP Candidate List 2024 : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా విడుదల చేసిన జీజేపీ వరంగల్ నుంచి ఆరూరి రమేశ్‌ను, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు పేర్లను ఖరారు చేసింది. దీంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల ఖరారు పూర్తైంది. తెలంగాణ నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల జాబితా చూస్తే
నియోజకవర్గం | పేరు |
మెదక్ | రఘునందన్‌రావు |
మహబూబ్‌నగర్ | డీకే అరుణ |
ఆదిలాబాద్ | గోడెం నగేశ్ |
పెద్దపల్లి | గోమాస శ్రీనివాస్ |
నల్గొండ | సైదిరెడ్డి |
మహబూబాబాద్ | సీతారాం నాయక్ |
సికింద్రాబాద్ | కిషన్ రెడ్డి |
నిజామాబాద్ | ధర్మపురి అర్వింద్ |
కరీంనగర్ | బండి సంజయ్ |
జహీరాబాద్ | బీబీ పాటిల్ |
నాగర్ కర్నూల్ | భరత్ ప్రసాద్ |
మల్కాజిగిరి | ఈటల రాజేందర్ |
భువనగరి | బూర నర్సయ్య గౌడ్ |
హైదరాబాద్ | డాక్టర్ మాధవి లత |
చేవెళ్ల | కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
వరంగల్ | ఆరూరి రమేశ్ |
ఖమ్మం | తాండ్ర వినోద్ రావు |
దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఇటీవలే 72 మందితో రెండో జాబితా విడుదల చేయగా తాజాగా 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ప్రకటించింది.