Kishan Reddy about Congress : ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు.
రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు బీజేపీకే మొగ్గు చూపారని, తాము ఆశించినట్లుగానే ఆ పార్టీకి రెండంకెల సీట్లు వస్తాయని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని, అయినా సీఎం రేవంత్, రాహుల్‌గాంధీ మాటలను నమ్మలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ కార్యకర్తలే వీరి మాటలను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. పార్టీ ఏదైనా సరే ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు భావించారని పేర్కొన్నారు. పట్టణప్రాంత వాసులే కాదని, ఈసారి పల్లెల్లోనూ బీజేపీకు ఓట్లు బాగా వేశారని తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం బలపడటానికి అవకాశం : మోదీకే ఓటు వేస్తున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగా చెప్పారని కిషన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లోనూ కొంత పోలింగ్ శాతం తగ్గిందని, అయినా బీజేపీకి సానుకూలంగా ఓట్లు పడ్డాయని అన్నారు. ఎక్కువ మంది ఏపీ ప్రజలు ఓట్ల కోసం అక్కడికి వెళ్లిపోయారని, అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పారు. హైదరాబాద్‌లో సెలబ్రిటీలు కూడా క్యూలో నిలబడి ఓటేశారని, వారు లైన్లో నిలబడి ఓటేయడం మంచి సందేశమని కొనియాడారు.
అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటేశారని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు పండగలాంటివని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం బలపడటానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.7 శాతం జరిగిందని, ఈసారి ఇది 65 శాతం దాటుతుందని అంచనా వేశారు. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని తెలిపారు.
'బీజేపీకి సంబంధించిన అంత వరకు అన్నీ నియోజకవర్గాల్లో మేం ఊహించిన దానికంటే సానుకూలత స్పందని వచ్చింది. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌రెడ్డి మాటలు పట్టించుకోలేదు. రేవంత్ మాటలకు నవ్వుకున్నారు తప్ప వారిని ఎవరూ పట్టించుకోలేదు. గతంలో చెప్పినట్లు, ఇప్పడున్న సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి'- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుంది: కిషన్‌రెడ్డి - kishan reddy on Congress