ETV Bharat / politics

'ధరణి' పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం - కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : ఏలేటి - Maheshwar Reddy on Dharani portal

BJP Maheshwar Reddy Says Dharani portal Scam : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాష్ట్రంలో ధరణి పేరుతో జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దీనిపై విచారణ ఎందుకు చేయించడం లేదని సీఎం రేవంత్​ రెడ్డిని ప్రశ్నించారు. ధరణి పోర్టల్​పై కేంద్రంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

BJP leaders Says Dharani Portal Is a Big Scam
BJP Maheshwar Reddy Says Dharani portal Scam
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 2:07 PM IST

Updated : Apr 2, 2024, 2:54 PM IST

BJP Maheshwar Reddy Says Dharani portal Scam : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాష్ట్రంలో ధరణి పేరుతో జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ధరణిలో రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్‌, కేటీఆర్​ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదే విధంగా లక్షల ఎకరాల భూమి కుంభకోణానికి ధరణి కేంద్రంగా మారిందన్న ఆయన, ఈ కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నప్పటికీ సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భారీ కుంభకోణాన్ని ఎందుకు బయటకు తీసుకురావడం లేదని మండిపడ్డారు.

సమగ్ర సర్వే పేరుతో భూములను డిజిటల్‌ చేయాలని కేంద్రం నిధులు ఇస్తే, కేసీఆర్ ధరణి పోర్టల్‌ (Dharani Portal Issues) పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్​ను ప్రభుత్వం అప్పగించిందని దుయ్యబట్టారు. ధరణి మీద సీఎం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కోకాపేట భూముల వేలంపైన గతంలో రేవంత్ రెడ్డి ధర్నా చేశారని, సీఎం అయ్యాక ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

Bandi Sanajay comments on CM KCR : 'ధరణి బాధితులతో.. సభ నిర్వహిస్తే పరేడ్​గ్రౌండ్​ నిండిపోతుంది'

"వేలాది ఎకరాల భూదాన్, దేవాలయ భూములు రికార్డుల్లో కనిపించడం లేదు. ధరణి మీద ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విచారణ జరిపించడం లేదు. చెరువు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కోకాపేట భూముల వేలంపైన గతంలో రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది." - మహేశ్వర్​ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే

BJP leaders Says Dharani Portal Is a Big Scam : భూముల కబ్జాలు చేసిన కేకే, రామ్మోహన్ కాంగ్రెస్​లో చేరగానే కడిగిన ఆణిముత్యం అయ్యారని వ్యాఖ్యానించారు. భూముల కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రూ.2 లక్షల కోట్ల కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్​ను ఎందుకు (KCR Started Dharani Portal) రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 40 శాతం వాటా కోసమే రక్షిస్తున్నారనే అనుమానం కల్గుతుందన్నారు. ఈ కుంభకోణాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. డిజిటలైజేషన్ పేరుతో పహానీలు రాయడం మానేశారని చెప్పారు.

Etela Meets Regional Ring Road Victims : 'కిసాన్ సర్కార్ అంటూ.. రైతులకు సంకెళ్లు వేస్తారా?'

విదేశీ కంపెనీ చేతిలో డేటాను పెట్టి తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల క్లియరెన్స్ (Bills Clearance) మీద బీ ట్యాక్స్ పేరుతో 8 నుంచి 9శాతం గుత్తేదారుల వద్ద వసూలు చేస్తున్నారని తెలిపారు. బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ హాఁ అన్నారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు దోచుకోవాలనీ చూస్తున్నారని ఆరోపించారు. అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందని మండిపడ్డారు.

ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం ఏలేటి

Kishan Reddy on Dharani Portal : 'ధరణి పోర్టల్‌ వచ్చింది ప్రజల కోసం కాదు.. BRS నేతల కోసం'

Last Updated : Apr 2, 2024, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.