BJP Leaders Honored in Visakhapatnam : గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ కక్షసాధింపులు, వేధింపులపై బీజేపీ ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారు. భగవంతుడే శిక్షిస్తాడంటూ వదిలేయకుండా, తగిన బుద్ధి చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. వైఎస్సార్సీపీకి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తేల్చిచెప్పారు.
ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రజా ప్రతినిధులను విశాఖలో సన్మానించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఈశ్వరరావును సత్కరించారు. కార్యక్రమంలో గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ వేధింపులను తలుచుకుని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
BJP MLA Vishnukumar Raju : ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరో అడుగు ముందుకేసి గత ఐదేళ్లలో బరితెగించిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదన్నారు.
" ఎన్నికల ర్యాలీలో వైఎస్సార్సీపీ వ్యక్తిని విమర్శిస్తే నాపై కేసు పెట్టారు. బెయిల్ తెచ్చుకుని ప్రచారంలో పాల్గొన్నా విమానాశ్రయంలో చంద్రబాబును ఘోరంగా అవమానించారు. పవన్ కల్యాణ్‌ను, కార్యకర్తలను రౌడీ మూకలు అడ్డుకున్నాయి. రెడ్‌బుక్‌లో ఉన్న ఎవర్నీ వదిలి పెట్టకూడదు" _విష్ణుకుమార్ రాజు, బీజేపీ ఎమ్మెల్యే
Central Minister Bhupathiraju Srinivasavarma : బీజేపీని లక్ష్యంగా చేసుకున్నవారిని ఉపేక్షించేదిలేదని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తేల్చి చెప్పారు.
" ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు చాాలా విషయాల్లో తలదూర్చారు. బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసిన వారికి తప్పక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం"_ భూపతిరాజు శ్రీనివాసవర్మ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి
విద్యాశాఖలో నాటి పెద్దల దొంగ విద్యలు - విద్యా కానుకకు టెండర్ లేకుండానే కాంట్రాక్ట్ - Irregularities in Vidya Kanuka
AP Minister Satyakumar : వైఎస్సార్సీపీ విధ్వంసాలన్నీ సరిదిద్దడానికి సమయం పడుతుందని, ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తేలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు.
" గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల రాబడిని చూపించి అప్పులు తెచ్చారు. ఈ అప్పులు తీర్చడానికి కూటమి ప్రభుత్వానికి సమయం పడుతుంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయాం"_సత్యకుమార్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
MP Purandeshwari : ప్రజాభిప్రాయానికి అనుగుణంగా బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి సూచించారు.
" ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలో బీజేపీ పార్టీ పుంజుకుంటుంది. రాష్ట్ర పరిపాలనలో మనం భాగస్వాములుగా ఉన్నాం. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించాల్సిన బాధ్యత మన మీద ఉంది"_పురందేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ