ETV Bharat / politics

మీరు లెటర్లు రాసుకుంటే చంద్రబాబుకు ఏం సంబంధం? - ఆ విషయంలో జడ్జి విజయమ్మే : బాలినేని

ఆడపడచు కన్నీళ్లు ఇంటికే అరిష్టమని జగన్‌ గుర్తించాలి - విజయమ్మ చొరవతోనే పరిష్కారం

Balineni on YS Jagan Property Disputes
Balineni on YS Jagan Property Disputes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Balineni on YS Jagan Property Disputes : వైఎస్సార్‌ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఆస్తుల విషయంలో వైఎస్సార్‌ పేరు చెడగొట్టి రోడ్డుపైకి వచ్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. రాజశేఖర్‌రెడ్డి పరువు బజారు కీడుస్తున్నారని ఆవేద వెలిబుచ్చారు. ఆడపడచు కన్నీళ్లు ఆ ఇంటికే అరిష్టమని జగన్‌ గుర్తించాలని హితవు పలికారు. ఇప్పటికైనా పరిష్కారం చేసేందుకు విజయమ్మ ముందుకురావాలని కోరారు. ఇందులో విజయమ్మ తప్ప ఎవరూ జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నట్లు బాలినేని చెప్పారు.

Sharmila vs YS Jagan : ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్సార్‌ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్లు కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎఎస్సార్సీపీలో తాను ఏమీ సంపాదించుకోలేదని ఉన్నవి కూడా పోగొట్టుకున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

"నా బిడ్డ సాక్షిగా చెబుతున్నా నేనేమీ సంపాదించుకోలేదు. నాపై విమర్శలు చేసేవాళ్లు జగన్‌ను నేరుగా అడగండి. ఎలా పోగొట్టుకున్నానో ఇన్నాళ్లూ నేను మనసులోనే పెట్టుకున్నా. నాకు సంస్కారం ఉంది కాబట్టే నేనేమీ మాట్లాడలేదు. పార్టీ మారాక ఆ పార్టీ గురించి నాయకుడి గురించి మాట్లాడలేదు. నా తండ్రి ఆస్తులమ్మి అప్పులు తీర్చుకున్నా జగన్‌కు తెలియదా? నా కోడలికి వచ్చిన ఆస్తులు అమ్మి కూడా అప్పులు తీర్చుకున్నా. ఆస్తులు పోయినా నేను మనసులో పెట్టుకున్నా. ఆస్తుల కోసం ఇప్పుడెందుకు జగన్‌ రోడ్డుపైకి వస్తున్నారు. ఆడబిడ్డ కన్నీళ్లు కుటుంబానికి మంచిది కాదని చెబుతున్నా." - బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన నేత

ఎన్నికలకు ముందే తనను పార్టీలోకి తీసుకోవాలని అనుకున్నట్లు పవన్‌ కల్యాణ్ చెప్పారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీలోకి తీసుకుందామంటే జగన్‌కు బంధువు అయినందున అడగలేదన్నారు. బంధువులను చీల్చడం తనకు ఇష్టం లేదని పవన్‌ హుందాగా మాట్లాడారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఉన్నప్పుడు కూడా వైఎస్సార్సీపీలో బాలినేని వంటి మంచివాళ్లు కూడా ఉన్నారని పవన్ చెబుతుండేవారని బాలినేని వివరించారు.

"ఆలోచన, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రేమ పునరుద్ధరిస్తా" - షరతులు వర్తిస్తాయన్న జగన్‌

అన్నగా, మేనమామగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే - జగన్​కు షర్మిల కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.