ETV Bharat / politics

వైసీపీని గెలిపిస్తే గ్రామాల్లో చెరువులు ఖాళీ అయ్యాయి: వైఎస్ షర్మిల - YS Sharmila Election Campaign - YS SHARMILA ELECTION CAMPAIGN

APCC Chief YS Sharmila Election Campaign: ఓట్లేసి గెలిపించినందుకు వైసీపీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో చెరువులు ఖాళీ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. న్యాయ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆమె పర్యటించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వసూలు రాజ అంటూ ఎద్దేవా చేశారు.

APCC_Chief_YS_Sharmila_Election_Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 1:38 PM IST

Updated : Apr 14, 2024, 3:56 PM IST

APCC Chief YS Sharmila Election Campaign: ఐదేళ్లు వైసీపీ అధికారం ఇస్తే ఏం చేశారో ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన న్యాయయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించారు. పట్టణంలోని ఆర్టీసీ కూడలిలో డాక్టర్‍ బి ఆర్‍ అంబేడ్కర్‍ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్‍ కూడలి నుంచి భేరివారిమండపం వరకు పర్యటించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. వైసీపీ అరాచకాలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్‍ రెడ్డి అవినీతి అక్రమాల పై విరుచకపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వసూలు రాజ అని ఆరోపించారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, కబ్జాల రాజా మధుసూధనరెడ్డి అని విమర్శించారు. ఎమ్మెల్యే దెబ్బకు పరిశ్రమలు అన్ని మూసుకొని పోతున్నాయని, మళ్ళీ దోచుకోమని ఆయనకే టికెట్‍ ఇచ్చారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి కనీసం రాజధాని లేకుండా చేసిందని షర్మిల దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్‍ బటన్ నొక్కి ఒకవైపు డబ్బులు ఇస్తూనే, మరోవైపు గుంజుకోవటం ఆయనకే చెల్లిందన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి హోదా కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన అవశ్యకత ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ తోనే సాధ్యమని గుర్తు చేశారు.

పులివెందుల ప్రజలారా కొంగుచాచి అడుగుతున్నాం- న్యాయం చేయండి: షర్మిలా, సునీత - Sharmila Election Campaign

ఓవైపు షర్మిల ప్రసంగిస్తుండగా, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మతో తన వర్గీయులు ఆందోళన చేపట్టారు. తనకే ఎమ్మెల్యే సీటు కేటాయించాల డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ ప్రకారం తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్నపూర్ణమ్మ నిరసనను పట్టించుకోని షర్మిల ప్రసంగం అనంతరం తన కారులో వెళ్లిపోయారు.

"ఓట్లేసి గెలిపించినందుకు వైసీపీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో చెరువులు ఖాళీ చేశారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో ఐదేళ్లు దోచేశారు. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే వసూల్‌ రాజా, కబ్జాల రాజా." - వైఎస్​ షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు

ఇది 'కోడికత్తి డ్రామా 2.0' - సోషల్​ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు - Attack on YS Jagan

వైసీపీని గెలిపిస్తే గ్రామాల్లో చెరువులు ఖాళీ అయ్యాయి: వైఎస్ షర్మిల

Last Updated : Apr 14, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.