ETV Bharat / politics

జగన్‌ పాలన వెలిగొండకు శాపంగా మారింది - ప్రాజెక్టును పూర్తిచేసి సస్యశ్యామలం చేస్తాం: మంత్రి నిమ్మల - MINISTERS VISITED WELIGONDA PROJECT

జగన్‌ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి, డీవీబీ స్వామితో కలిసి పరిశీలించారు.

ministers_visited_weligonda_project
ministers_visited_weligonda_project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 4:42 PM IST

Updated : Oct 29, 2024, 5:08 PM IST

Ministers Visited Weligonda Project: గత ఐదేళ్లు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం జలయజ్ఞం పేరును ధన యజ్ఞంగా మార్చిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిమ్మల సందర్శించారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని 2వ టన్నెల్​ను మంత్రులు పరిశీలించారు. అక్కడి నుంచి కడపరాజుపల్లి వద్ద ఫీడర్‌ కాలువను మంత్రి నిమ్మల, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి సందర్శించారు. మంత్రి నిమ్మల స్వయంగా బైక్‌ నడిపారు. గొట్టిపాటి లక్ష్మితో కలిసి బైక్‌పై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా వెళ్లారు.

నాసిరకంగా ప్రాజెక్టు పనులు: ఈ ప్రాంత ప్రజలను వైఎస్సార్​సీపీ నమ్మించి మోసం చేసిందని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదన్నారు. ఈ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేపట్టారని నిమ్మల ఆరోపించారు. ఫీడర్‌ కెనాల్‌ 11,500 క్యూసెక్కులు వెళ్లేలా పనులు చేపట్టాల్సి ఉంది కాని ఇప్పుడు కనీసం 10 క్యూసెక్కులు వెళ్లినా బండ్ కొట్టుకుపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. ఫీడర్‌ కెనాల్‌ గట్టు నాణ్యతపై నివేదిక ఇవ్వాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. వెలిగొండ పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వైరల్ - షాక్ ఇచ్చిన అధికారులు - లోకేశ్ చొరవతో మళ్లీ విధుల్లోకి

2014-19లోనే మెజార్టీ పనులు పూర్తి: వైఎస్సార్​సీపీ హయాంలో ప్రాజెక్టు పూర్తిచేస్తానన్న జగన్ ఏంచేశారని మంత్రి డోలా ప్రశ్నించారు. పనులు చేయలేదు, పరిహారం ఇవ్వకుండా ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయవు వెలిగొండను ప్రారంభించింది చంద్రబాబు పూర్తిచేసేది కూడా ఆయనేనని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అంతే కాకుండా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా అన్నారు. 2014-19లోనే వెలిగొండ ప్రాజెక్టు మెజార్టీ పనులు పూర్తిచేశామని మంత్రి డీబీవీ స్వామి తెలిపారు.

జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారింది. ఎన్నికలకు ముందు హడావిడిగా జాతికి అంకితమన్నారు. ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జ‌గ‌న్ విధ్వంసమే క‌నిపిస్తోంది. పనులు అప్పగించి పూర్తికాకుండానే నిధులు కట్టబెట్టారు. 10 క్యూసెక్కులు కూడా లేకుండా వెలిగొండ ప్రారంభోత్సవమన్నారు. ఒక్క గ్రామానికి కూడా పున‌రావాస కాల‌నీలు నిర్మించిన పాపాన పోలేదు. రెండు ద‌శ‌ల్లో వెలిగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.- నిమ్మల రామానాయుడు, మంత్రి

నారా లోకేశ్ టూర్ అప్డేట్స్ - సత్య నాదెళ్ల, శంతను నారాయణ్‌తో భేటీ

MRPకి మించి మద్యం అమ్మితే 5 లక్షలు జరిమానా - రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు

Last Updated : Oct 29, 2024, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.