ETV Bharat / politics

మతవిద్వేషాలు రెచ్చగొట్టే యత్నం - జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి: మంత్రులు - AP Ministers fires on YS Jagan - AP MINISTERS FIRES ON YS JAGAN

AP Ministers Fires on YS Jagan: ఎలాంటి దేశంలో బతుకుతున్నామోనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. దేశ సంప్రదాయాలు, మత విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో మాత్రం ఎందుకుండాలని ఏపీ మంత్రులు నిలదీశారు. తక్షణమే దేశానికి, ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

AP Ministers Fires on YS Jagan
AP Ministers Fires on YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 6:05 PM IST

AP Ministers Fires on YS Jagan: డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇమ్మంటే 'నా మతం మానవత్వం' అంటూ జగన్ అమాయకత్వం నటిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఎద్దేవా చేశారు. దళితుడైన సుబ్రహ్మణ్యంను మీ పార్టీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసినపుడు నీ మానవత్వం ఏమైందని ప్రశ్నించారు. తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలంటూ నీ చెల్లెలు సునీత రెడ్డి కన్నీరు కార్చినపుడు నీ మానవత్వం ఏమైందని నిలదీశారు.

అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టడమేనా నీ మానవత్వం అని మండిపడ్డారు. నాకే ఇలా ఉంటే, దళితుల పరిస్థితి ఏంటని కులాల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. హిందువులుగా ఉన్న దళితులు శ్రీవారిని దర్శించుకోవడం లేదా అని ప్రశ్నించారు. టీటీడీలో నిబంధనలు కులానికి కాదని, మతానికని జగన్​కి తెలియదా అని దుయ్యబట్టారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన నీచ రాజకీయాలు మానుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే నిబంధనల్ని గౌరవిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడా, జగన్ డిక్లరేషన్ ఎందుకివ్వరని ప్రశ్నించారు.

జగన్​కు డిక్లరేషన్‌ ఇవ్వడం ఇష్టం లేదు - అందుకే తిరుమల వెళ్లలేదు: బుద్దా వెంకన్న - Buddha Venkanna Fires on YS Jagan

Minister Gottipati Ravi Kumar Comments: దేశ సంప్రదాయాలను పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్​ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలుంటాయనీ, వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడుగా ఎదగగలరని జగన్​కు మంత్రి హితవు పలికారు. మత విశ్వాసాలు, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ, జగన్ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశ ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలతో అత్యున్నత పదవులు పొంది, వాటిని అడ్డం పెట్టుకుని దేశ సంపదను జగన్ కొల్లగొట్టాడని ఆరోపించారు. ఇప్పుడు అదే దేశంలో ఉంటూ దేశ సంప్రదాయాలను కించపరుస్తున్నాడని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాల్సిందేనని తేల్చిచెప్పేసరికి, ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలను కించపరుస్తుండటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. భారతదేశమన్నా, దేశ సంప్రదాయాలన్నా ఏమాత్రం గౌరవం లేదనే తన నైజాన్ని జగన్ బయటపెట్టుకున్నాడని పేర్కొన్నారు. దేశాన్ని, దేశ సంప్రదాయాలను కించపరిచుస్తూ, భారతదేశంలో మాత్రం జగన్ ఎందుకుండాలని మంత్రి గొట్టిపాటి రవి ప్రశ్నించారు.

కల్తీ నెయ్యి అంశంపై విచారణ వేగవంతం - మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో సిట్‍ పర్యటన - SIT TEAM TO TIRUMALA

Home Minister Vangalapudi Anitha: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులేనని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికీ పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనేనని ఆమె విమర్శించారు. లడ్డూ టేస్ట్ గురించి మాట్లాడిన జగన్, ఏ రోజు తిరుమల లడ్డూ రుచి చూశాడో చెప్పాలని అనిత డిమాండ్‌ చేశారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు అంశాన్ని ముడిపెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశాడని దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్​గా దళితులకు అవకాశం ఇచ్చారా అని మంత్రి నిలదీశారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని, హిందూ దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్​ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్​తో తనని దేశ బహిష్కరణ చేయాలనే పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు.

జగన్​కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్​లో చుట్టి పక్కన పెట్టేయటం, అక్షింతలు వేస్తే తలదులిపేసుకున్న సందర్భాలు ఎన్నో చూడలేదా అని ప్రశ్నించారు. జగన్ పర్యటన సందర్భంగా ఒక్కరినైనా బైండోవర్ చేశామా, లేక గృహనిర్బంధం చేశామా అని అనిత నిలదీశారు. శాంతి భద్రతల పరిరక్షణకు సాధారణంగా అమల్లోకి తెచ్చే సెక్షన్ 30 యాక్ట్ తెస్తే, తనకే అది జారీ చేసినట్లు జగన్ కథలు అల్లాడని దుయ్యబట్టారు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావాలనుకునే తత్వం జగన్​ది కాబట్టే ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నాడని మండిపడ్డారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై సాక్షి బృందంతో సిట్ వేసి దర్యాప్తు జరగాలని జగన్ కోరుకుంటున్నట్లు ఉందని వంగలపూడి అనిత విమర్శించారు. తిరుమల సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందేనని మంత్రులు స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన పాపం ఊరికే పోదని దుయ్యబట్టారు.

దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్‌ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు? : హోంమంత్రి అనిత - Home Minister Comments On Jagan

Minister Satya Kumar on Jagan: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్య వినియోగం పాపం జగన్మోహన్ రెడ్డి దేనని, ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన జగన్‌ తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారని మంత్రి మండిపడ్డారు. తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెబితే చేసిన పాపం కొంతైనా తీరుతుందన్నారు. తిరుమలకు వెళ్లి డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలంటే దర్శనానికే డుమ్మా కొట్టిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను టీటీడీ ఛైర్మన్​గా నియమించారన్నారు. తనకు అనుకూలమైన అధికారి ధర్మారెడ్డిని ఈవోగా తెచ్చుకున్నారన్నారు. ఇన్ని చేసిన జగన్, లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి విషయంలో మాత్రం అబద్ధాలు చెబుతూ ఉన్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. కల్తీ నెయ్యి వినియోగంపై సమాధానం చెప్పుకోలేక నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయట ఇతర మతాలను గౌరవిస్తానని జగన్ చెబుతూ ఉన్నారని ధ్వజమెత్తారు. డిక్లరేషన్​లో సంతకం చేయాల్సి వస్తుందని, ధైర్యం లేకనే తిరుమలకు వెళ్లలేదని మంత్రి ఆరోపించారు.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన పాపం జగన్‌దే: మంత్రి సత్యకుమార్‌ - Minister Satyakumar on Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.