AP High Court on Guntur Lok Sabha Results: ఎంపీ జయదేవ్ గల్లాకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు టీడీపీ ఎంపీగా ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో మోదుగుల లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. ఫారం 13బీ లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్‌ను పేర్కొనకపోయిన సందర్భంలో వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
వైసీపీ కబంద హస్తాల్లో హథీరామ్‌జీ మఠం- హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చినా ఆగని విల్లాల నిర్మాణం
ఈ నేపథ్యంలో ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికను సమర్థిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు తీర్పు వెలువరించారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఎన్నికను సవాలు చేస్తూ వైసీబీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి అప్పట్లో హైకోర్టులో 'ఎన్నికల పిటిషన్' దాఖలు చేశారు. ఓట్లను సక్రమంగా లెక్కించకపోవటంతో స్వల్ప మెజారిటీతో తాను ఓటమిపాలయినట్లు పేర్కొన్నారు.
నైపుణ్యంలేని వారు ఇంగ్లీష్‌లో ఎలా బోధిస్తారు?- జగన్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు జయదేవ్ గల్లాకు అనుకూలంగా వ్యవహరించారని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మొత్తం పోలైన 15,084 పోస్టల్ ఓట్లలో 9,782 ఓట్లను అధికారులు తిరస్కరించారన్నారు. దీంతో తాను 4,205 ఓట్లతో ఓడిపోయినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. 9,782 పోస్టల్ ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఫలితాన్ని వెల్లడించాలని కోరారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్, ఎంపీ గల్లా జయదేవ్ తరఫున సీనియర్ న్యాయవాది బీ.ఆదినారాయణరావు, న్యాయవాది మేడమల్లి బాలాజీ వాదనలు వినిపించారు. దీనిపై వాదనలు పూర్తవటంతో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి తాజాగా నిర్ణయాన్ని ప్రకటించారు. వేణుగోపాల్రెడ్డ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. ఈ క్రమంలో సంబంధిత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను విడుదల చేయాలని వాటిని కస్టడీలో ఉంచుకున్న అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతి ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు