ETV Bharat / politics

వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై పూర్తి వివరాలివ్వండి - అధికారులకు చంద్రబాబు ఆదేశం - White Paper on YSRCP Land Grabs

White Paper on YSRCP Land Grabs : రాష్ట్రప్రభుత్వం త్వరలోనే మరో కీలక అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో భూకబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేసే క్రమంలో, అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలు నిజమే కానీ, బాధ్యత మాది కాదన్న రీతిలో వారి నివేదిక ఉంది. నివేదిక అసమగ్రంగా ఉందంటూ ముఖ్యమంత్రి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో సమగ్రంగా రిపోర్టు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

White Paper on YSRCP Land Grabs
White Paper on YSRCP Land Grabs (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 1:41 PM IST

వైఎస్సార్సీపీ భూకబ్జాలపై త్వరలోనే శ్వేతపత్రం (ETV Bharat)

AP Govt Exercise White Paper on Lands Encroachment : గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో భూకబ్జాలు, విశాఖలో దసపల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం, అసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, టీజీ భరత్‌తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.

ఏపీ భూ హక్కు చట్టం, రీసర్వే, విద్యుత్‌ సంస్థలు, వైఎస్సార్సీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపు, పేదలకు సెంటు స్థలాలు, రెవెన్యూ వ్యవహారాల్లో ఆ పార్టీ నాయకుల జోక్యం వంటి అంశాలపై అధికారులు రూపొందించిన నివేదికను చంద్రబాబు పరిశీలించారు. అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, అప్పటి నేతలే చేసినట్టుగా ఉంది. కానీ వాటిలో ఎక్కడా తమ ప్రమేయమే లేనట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదిక సమగ్రంగా లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో మరింత లోతుగా తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

విశాఖలో భూముల స్వాహా! : విశాఖలో రామానాయుడు స్డూడియో భూములను నిబంధనలకు విరుద్ధంగా, రెసిడెన్షియల్‌ కేటగిరీలోకి మార్చారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. వివాదాస్పద సీబీసీఎన్​సీ భూముల్లో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భవన నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులిచ్చినట్లు వెల్లడించారు. రూ.65 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని చెప్పారు. ఎన్​సీసీ, దసపల్లా, హయగ్రీవ భూములు స్వాహా చేశారని అధికారులు నివేదికలో తెలిపారు.

తక్కువ ధరకు కొట్టేసిన వైఎస్సార్సీపీ నేతలు : శారదా పీఠానికి కొత్తవలసలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని, ఎకరం ఒక రూపాయి చొప్పున కేటాయించినట్లు, అధికారులు నివేదికలో తెలిపారు. కేటాయింపు జరిగి 20 ఏళ్లు దాటిన అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన చట్టం మేరకు, 9,93,284 ఎకరాలను 22(ఎ) జాబితా నుంచి తప్పించినట్లు స్పష్టం చేశారు. ఆ భూములను పేదల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు తక్కువ ధరకు కొట్టేశారని అధికారులు వివరించారు.

ఈ చట్టాన్ని మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకురాలేదు : నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన నమూనా టైట్లింగ్‌ యాక్ట్‌ స్ఫూర్తికి భిన్నంగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. ఆ చట్ట నిబంధనలతో ప్రజల భూములకు రక్షణ ప్రశ్నార్థకం కానుందని తెలిపారు. ప్రమాదకరమైన ఈ చట్టాన్ని మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకురాలేదని గుర్తుచేశారు. భూముల రీసర్వే నిర్వహణకు సమయం ఇవ్వనందున, తుది రికార్డుల్లో అనేక తప్పులు దొర్లాయని అధికారులు వివరించారు.

పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటోలు వేయడాన్నీ నివేదికలో అధికారులు ప్రస్తావించారు. ఒంగోలు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూకుంభకోణాలు జరిగాయని చెప్పారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీలోనూ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. సర్వే రిపోర్టు, భూ మార్పిడి, పాత స్టాంపు పేపర్లపై పాత తేదీలు నమోదు చేసి, నకిలీ వ్యక్తులతో జీపీఏలను సృష్టించారని తెలిపారు. కుటుంబ వివాదాల్లో ఉన్న, అన్‌క్లెయిమ్డ్‌ ప్రైవేట్‌ భూములను కొందరు స్వాహా చేశారని వెల్లడించారు.

రెవెన్యూ వ్యవహారాలన్నింటా జోక్యం : ఇళ్ల పట్టాలు, వ్యవసాయ భూముల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికలోనూ, వైఎస్సార్సీపీ నాయకులు జోక్యం చేసుకునేవారని, అధికారులు తమ నివేదికలో ప్రస్తావించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని తెలిపారు. ఓటర్ల నమోదులోనూ కల్పించుకొని, వారికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారని వివరించారు. తీవ్ర అవకతవకలకు పాల్పడ్డ నలుగురు తహసీల్దార్ల డిస్మిస్‌, నిర్బంధ పదవీ విరమణ, 10 మంది హోదా తగ్గింపునకు సీసీఎల్ఏ ఆదేశాలిచ్చిందని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వారి శిక్షను తగ్గించారని, అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

సాగు భూముల్లో అక్రమ లేఔట్​లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయేతర భూములుగా మార్చేసుకున్నారని తెలిపారు. నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలోకి వచ్చే భూములనూ చేపల చెరువులుగా మార్చేశారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తుల భూములను 22‍‌(ఎ) జాబితాలో పెట్టించి, వారిపై ఒత్తిడి తెచ్చి, కారుచౌకగా కొట్టేశారని అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

ఇళ్ల స్థలాల్లో భారీ దోపిడీ : పేదలకు ఇళ్ల స్థలాల కింద ఇవ్వాలనుకున్న భూములను వైఎస్సార్సీపీ నేతలు బినామీల పేర్లతో తక్కువ ధరకు కొని, వాటిని అధిక ధరలకు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 28,554. 64 ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించారని వివరించారు. అధిక శాతం ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్‌ భూములను సేకరించారని అధికారులు పేర్కొన్నారు.

నివాసయోగ్యం కాని, నీరు నిలిచే, పర్యావరణ ప్రభావం చూపే భూములను సేకరించారని పేర్కొన్నారు. చాలాచోట్ల గ్రామాలకు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు వాటిని తీసుకోలేదని వెల్లడించారు. ఎన్జీటీ ఆదేశాలతో 54 ఎకరాల భూములను మళ్లీ అటవీ భూములుగా పునరుద్ధరించాల్సి వచ్చిందని, ఫలితంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలోనూ పారదర్శకత లేదని, పెద్దసంఖ్యలో అనర్హుల పేర్లను జాబితాల్లో చేర్చారని వివరించారు. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 20 శాతం మంది ఇప్పటికే అమ్ముకున్నారని చెప్పారు.

ఆవ భూములకు పరిహారం : తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలకు నీటమునిగే ఆవ భూములను సేకరించారని, ఇళ్ల పట్టాలకు అనుకూలం కాని వీటికి అధిక మొత్తంలో పరిహారం చెల్లించారని అధికారులు తెలిపారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పశువుల మేత బీడు భూములను సేకరించారని చెప్పారు. 2013 భూసేకరణ చట్టంలో నిర్ణయించిన దానికంటే 2-3 రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించేలా ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా మధ్యవర్తులు వాటాలు తీసుకున్నారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ నేతలకే కాంట్రాక్టులు : కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఎకరా రూ.30 లక్షలు ఉంటే, పరిహారం రూ.55 లక్షల చొప్పున ఇప్పించారని వెల్లడించారు. పల్లపు ప్రాంతాలను సేకరించి, వాటిని చదును చేసే కాంట్రాక్టులను కూడా వైఎస్సార్సీపీ నేతలే దక్కించుకున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడిక తీసిన మట్టిని అక్కడకు తరలించి నిధులు కాజేశారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో భూమి చదును కోసం రూ.34.73 కోట్లు వినియోగించారని ప్రస్తావించారు.

ఊరికి దూరంగా, శ్మశానాలకు, అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నచోట లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదని తెలిపారు. ప్రభుత్వం తక్కువ ధరకు భూములు సేకరిస్తోందంటూ, విశాఖ జిల్లా భీమిలి, ఆనందపురం, పద్మనాభం, అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, పరవాడలో వైఎస్సార్సీపీ నేతలు అక్కడి రైతులను తప్పుదోవ పట్టించడంతోపాటు భయపెట్టారని పేర్కొన్నారు. వారి భూములను ఒప్పంద పత్రాలపై కొనుగోలు చేశారని అన్నారు.

ఇండోసోల్‌ సోలార్‌ సంస్థకు 10,226 ఎకరాలు, గ్రీన్‌కో కంపెనీకి 14,828 ఎకరాలు కేటాయించారని అధికారులు, సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. వివిధ జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన భూములను వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కేటాయించారని తెలిపారు. ఎకరాకు ఏడాదికి రూ.1000 చొప్పున 40.78 ఎకరాల భూమిని కట్టబెట్టారని బహిర్గతం చేశారు. వాటి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు నివేదికలో వెల్లడించారు.

సంతకాలు ఫోర్జరీ చేసి భూములు దోపిడీ - రెచ్చిపోతున్న వైసీపీ మూకలు

భీమిలీ బీచ్​ వద్ద యథేచ్ఛగా వైఎస్సార్​సీపీ నేతల భూకబ్జాలు - స్పందించని అధికారులు - YSRCP Leaders Illegal constructions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.