ETV Bharat / politics

పల్నాడు జిల్లాలో సీఈవో, డీజీపీ పర్యటన - స్ట్రాంగ్ రూముల భద్రతపై ఆరా - AP CEO Inspected Strong Rooms - AP CEO INSPECTED STRONG ROOMS

AP CEO and DGP Inspected Strong Rooms: ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటించారు. మొదటగా కౌంటింగ్​కు చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నరసరావుపేట మండలం కాకానిలోని జేఎన్టీయూ కళాశాలకు వెళ్లారు. స్ట్రాంగ్ రూమ్స్​లోని భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు.

AP CEO and DGP Inspected Strong Rooms
AP CEO and DGP Inspected Strong Rooms (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 4:18 PM IST

AP CEO and DGP Inspected Strong Rooms: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వరుసగా జిల్లాలలో పర్యటిస్తూ, అధికారలకో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా స్ట్రాంగ్ రూమ్స్​లోని భద్రతా ఏర్పాట్ల గురించి సైతం తెలుసుకుంటున్నారు.

తాజాగా పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు పర్యటించారు. మొదటగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల కౌంటింగ్​పై చేపట్టిన చర్యల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నరసరావుపేట మండలం కాకాని వద్దనున్న జేఎన్టీయూ కళాశాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేరుకున్నారు.

జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్స్, ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సీఈవో ముకేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, ఎస్పీ మలికా గార్గ్​లను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లపై సీఈవో, డీజీపీలకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, ఎస్పీ మలికా గార్గ్, తదితర అధికారులు వివరించారు.

కౌంటింగ్ రోజు, తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ట భద్రత : సీఈవో ఎంకే మీనా - CEO MK Meena on Votes Counting

Arrangements for Votes Counting : ఏపీ ఓటర్ల తీర్పు ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లేదా పామర్రు నియోజకవర్గం, ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో వెల్లడికానుందనే అంచనాలు వేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రమాణాల ప్రకారం ఓట్ల లెక్కింపునకు నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేయాలి. కానీ 2019 ఉమ్మడి జిల్లా ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో 14 టేబుళ్లకు సరిపడా హాలుల్లేవని ఇష్టానుసారం ఏర్పాటు చేయించారు. దీంతో రిజల్ట్స్ వెల్లడిలో జాప్యం జరిగింది. ఈసారి మాత్రం ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభ, శాసనసభ సీట్లకు టేబుళ్లు పక్కపక్కనే ఉంటాయి.

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష - అధికారులకు కీలక ఆదేశాలు - ECI reviews counting arrangements

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.