ETV Bharat / politics

₹2.86 లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ - సభలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన - ap budget 2024

Andhra Pradesh Vote on Account Budget 2024-25: 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల 86 వేల 389 కోట్ల రూపాయల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కథనాన్ని వెలువరించిన పీటీఐ వార్తా సంస్థ 2 లక్షల 30 వేల 110 కోట్ల రెవెన్యూ వ్యయం, 30 వేల 530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించినట్లు తెలిపింది. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి తెలిపారు.

Andhra_Pradesh_Vote_on_Account_Budget
Andhra_Pradesh_Vote_on_Account_Budget
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 7:50 PM IST

2.86 లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ - సభలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

Andhra Pradesh Vote on Account Budget 2024-25: అంబేడ్కర్ ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. 2024 - 25 ఆర్ధిక సంవత్సరానికి 2 లక్షల 86 వేల 389 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్‌ను సభలో మంత్రి ప్రవేశపెట్టారు.

మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం 2 లక్షల 30 వేల 110 కోట్ల రూపాయలు . మూలధన వ్యయం 30 వేల 530 కోట్ల రూపాయలు బుగ్గన ప్రతిపాదించారు. 24 వేల 758 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 55 వేల 817 కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉంటుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దవ్యలోటు 3.51 శాతం ఉంటుందని, రెవెన్యూ రాబడి 2 లక్షల 5 వేల 352 కోట్లు వస్తుందని మంత్రి అంచనా వేశారు.

కేంద్ర పన్నుల ద్వారా 49 వేల 286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా లక్షా 9 వేల 538 కోట్లు వస్తుందని, పన్నేతర ఆదాయం 14 వేల 400 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 32 వేల 127 కోట్లు వస్తుందని ఆర్థికమంత్రి అంచనా వేశారు. బహిరంగ మార్కెట్‌లో 71 వేల కోట్లు, కేంద్రం నుంచి 61 వేల 642 కోట్లు, ఇతర మార్గాల్లో 25 వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించాలని సర్కార్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఐదేళ్ల కాలంలో 30 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసి సంక్షేమాంధ్రగా రాష్ట్రాన్ని మార్చినట్లు మంత్రి బుగ్గన శాసనసభలో వెల్లడించారు. నగదు బదిలీ ద్వారా 2 లక్షల 53 వేల కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. తలసరి ఆదాయం 2,19,518తో దేశంలోనే 9 ర్యాంక్ లో రాష్ట్రం నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు.

2019 నుంచి 311 పైగా భారీ మెగా పరిశ్రమలు 5,995 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. 65 కొత్త ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారని, గడచిన ఐదేళ్లలో 4 లక్షల 95 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2023లో 16.2 శాతం పెరిగి ఏపీ 4 స్థానానికి ఎదిగిందని మంత్రి వివరించారు.

బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టకముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 2024 - 25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు ఫిబ్రవరి 5న శాసనసభ, మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.