ETV Bharat / politics

శ్రీసిటీలో ఒకేరోజు 15 కంపెనీలు ప్రారంభం - మరో 7 సంస్థలకు శంకుస్థాపన - CM Chandrababu Naidu Sri City Visit - CM CHANDRABABU NAIDU SRI CITY VISIT

CM Chandrababu Naidu Sri City Visit: సీఎం చంద్రబాబు తిరుపతిలోని శ్రీసిటీలో పర్యటించనున్నారు. శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.900 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

companies inauguration in sricity
companies inauguration in sricity (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 7:51 PM IST

Updated : Aug 19, 2024, 9:40 AM IST

CM Chandrababu Naidu Sri City Visit: కూటమి ప్రభుత్వ రాకతో ఆంధ్రప్రదేశ్​కు మంచిరోజులు వచ్చాయి. పెట్టుబడుల కోసం కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. మరోవైపు పలు కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు.

సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీలో పర్యటించనున్న సీఎం, పలు పరిశ్రమల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలా 40 నిమిషాలకు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు, హెలికాప్టర్‌ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీకి వెళతారు.

ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం శ్రీసిటీకి వెళ్లనున్నారు. శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను శ్రీసిటీలో సీఎం ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

'రాష్ట్రానికి కేటాయించిన నిధులు త్వరగా ఇవ్వండి'- ఆ విషయాలన్నీ మోదీ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు - CM Chandrababu met Modi

900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 1,213కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్​లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్‌, ఇజ్రాయిల్‌కు చెందిన నియోలింక్‌, జపాన్‌కు చెందిన నైడిక్‌, ఓజెఐ ఇండియా ప్యాకేజ్‌, జర్మనీకి చెందిన బెల్‌ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్‌, ఆటోడేటా, బాంబేకోటెడ్‌ స్పెషల్‌ స్టీల్స్‌, ఈప్యాక్‌, ఇఎస్‌ఎస్‌కెఏవై, ఎవర్‌షైన్‌, జేజీఐ, త్రినాత్, జెన్‌లెనిన్‌ సంస్థలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్‌, జపాన్‌కు చెందిన ఏజీ ఆండ్‌ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఇ, సింగపూర్‌లతో పాటు భారతదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోనున్నారు. శ్రీసిటీలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించనున్నారు. తిరిగి సాయంత్రం ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.

పోలవరం కొత్త డయాఫ్రం వాల్​కు గ్రీన్​సిగ్నల్ - మేఘాకే నిర్మాణ పనులు! - CM Chandrababu Delhi Tour

Last Updated : Aug 19, 2024, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.