ETV Bharat / politics

నోరూరించే అనకాపల్లి బెల్లం స్వీటే - రాజకీయాలు హాట్​ గురూ ! - Anakapalli LOK SABHA ELECTIONS - ANAKAPALLI LOK SABHA ELECTIONS

Anakapalli Lok Sabha Constituency: అనకాపల్లి పేరు వినగానే అందరికీ నోరూరుతుంది. నాణ్యమైన బెల్లం తయారీకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇక్కడ ఉంది. స్వాతంత్య్రోద్యమంలోనూ అనకాపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. విదేశీ వస్తు బహిష్కరణోద్యమాన్ని మహాత్మాగాంధీ ఇక్కడ ప్రారంభించారు.

Anakapalli_Lok_Sabha_Constituency
Anakapalli_Lok_Sabha_Constituency
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 6:55 AM IST

Anakapalli Lok Sabha Constituency: అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో నిలవగా టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్​ కుమార్​పై వైఎస్సార్సీపీకి చెందిన బీశెట్టి వెంకట సత్యవతి 89,192 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆనంద్‌కు 41.30శాతం ఓట్లు రాగా సత్యవతి 48.71శాతం ఓట్లు రాబట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన నేతలను కాదని ఈసారి కొత్త వారిని ప్రధాన పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

  1. మాడుగుల
  2. చోడవరం
  3. అనకాపల్లి
  4. పెందుర్తి
  5. యలమంచిలి
  6. పాయకరావుపేట(ఎస్సీ)
  7. నర్సీపట్నం

2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:

  • మొత్తం ఓటర్ల సంఖ్య- 12.77 లక్షలు
  • ఓటర్లలో పురుషుల సంఖ్య- 6.23 లక్షలు
  • మహిళా ఓటర్ల సంఖ్య- 6.53 లక్షలు
  • ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 38

ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు: ప్రస్తుతం ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఈ లోక్​సభ స్థానం బీజేపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం సీఎం రమేష్​ను బరిలో దింపింది. అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీఎం రమేష్‌ రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి. ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఇవన్నీ కలిసి వస్తాయనే ఉద్దేశంతోనే బీజేపీ రమేష్‌ను అనకాపల్లి నుంచి రంగంలో దించింది.

Anakapalli_Lok_Sabha_Constituency
ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు

మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తొలి మహిళా ఎంపీగా గెలిచి రికార్డులకెక్కిన డాక్టరు బీశెట్టి వెంకట సత్యవతి రెండోసారి పోటీ చేయాలనుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ ఆమె స్థానంలో ఈసారి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడ్ని బరిలోకి దించింది. ఇక కాంగ్రెస్‌ నుంచి వేగి వెంకటేష్‌ పోటీ చేస్తున్నారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ కమిటీ సభ్యుడిగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే:

  • 1962: ఎం.ఎస్‌. మూర్తి(కాంగ్రెస్‌)
  • 1967: ఎం.ఎస్‌. మూర్తి(కాంగ్రెస్‌)
  • 1971: ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు(కాంగ్రెస్‌)
  • 1977: ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు(కాంగ్రెస్‌)
  • 1980: ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు(కాంగ్రెస్‌)
  • 1984: పి.అప్పలనరసింహం(టీడీపీ)
  • 1989: కొణతాల రామకృష్ణ(కాంగ్రెస్‌)
  • 1991: కొణతాల రామకృష్ణ(కాంగ్రెస్‌)
  • 1996: చింతకాయల అయ్యన్నపాత్రుడు(టీడీపీ)
  • 1998: గుడివాడ. గురునాథరావు (కాంగ్రెస్‌)
  • 1999: గంటా శ్రీనివాసరావు(టీడీపీ)

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:

  • 2004: పప్పల చలపతిరావు(టీడీపీ)- నంద గోపాల్ గంధం(కాంగ్రెస్)
  • 2009: సబ్బం హరి(కాంగ్రెస్‌)- నూకారపు సూర్యప్రకాశ్ రావు(టీడీపీ)
  • 2014: ముత్తంశెట్టి శ్రీనివాసరావు(టీడీపీ)- గుడివాడ అమర్నాథ్(వైఎస్సార్సీపీ)
  • 2019: బీశెట్టి వెంకట సత్యవతి(వైఎస్సార్సీపీ)- అడారి ఆనంద్​కుమార్​(టీడీపీ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.