ETV Bharat / politics

రేపటి అమిత్​ షా తెలంగాణ టూర్​ రద్దు - Kishan Reddy on Amith Shah Tour

Amit Shah Telangana Tour Cancelled Reason : రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పర్యటన రద్దు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి తెలిపారు. కొన్ని అత్యవసర పనుల వల్ల రద్దు చేశామని ప్రకటించారు. పర్యటన రద్దు కావడంపై పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం వ్యక్తమైంది.

Kishan Reddy on Amith Shah Tour
Amit Shah Telangana Tour Cancelled Reason
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 4:04 PM IST

Updated : Jan 27, 2024, 5:01 PM IST

Amit Shah Telangana Tour Cancelled Reason : రాష్ట్రంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన రద్దైంది. అత్యవసర పనుల వల్ల పర్యటన రద్దు చేశామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పర్యటన రద్దుతో రేపు కరీంనగర్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయని ఆయన వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అమిత్‌షా పర్యటన రద్దు(Amit Shah Telangana Tour) కావడంపై కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు.

ఈ నెల 28న రాష్ట్రానికి అమిత్​ షా - ఒకేరోజు మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన

BJP Divided to Clusters in Telangana : కేంద్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. పది సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకు కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. అవి

  • వరంగల్‌, మహబూబాబాద్​, ఖమ్మం పార్లమెంట్‌లు
  • సికింద్రాబాద్‌,హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, భువనగిరి పార్లమెంట్లు
  • మహాబూబ్​నగర్, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ పార్లమెంట్లు
  • పెద్ధపల్లి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలు
  • జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల, కరీంనగర్‌ పార్లమెంట్లుగా విభిజించింది.

ఈ ఐదు పార్లమెంట్‌ క్లస్టర్లకు రాష్ట్ర నాయకత్వం ఇంచార్జీలను నియమించింది. వరంగల్‌ క్లస్టర్‌కు మాజీ ఎమ్మెల్యే మాతినేని ధర్మారావు, సికింద్రాబాద్‌ క్లస్టర్‌కు కాసం వెంకటేశ్వర్లు, మహాబూబ్‌ నగర్‌ క్లస్టర్‌కు బంగారు శృతి, పెద్ధపల్లి క్లస్టర్‌కు దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, కరీంనగర్‌ క్లస్టర్‌కు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిలకు ఇంచార్జీ బాధ్యతలు కట్టబెట్టింది. పార్లమెంట్‌ క్లస్టర్ల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం, లోక్‌సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) విజయమే లక్ష్యంగా ఇంచార్జీలను నియమించింది.

పండుగ వేళ అమిత్ షా కుటుంబంలో తీవ్ర విషాదం

BJP Senior Leaders Telangana Tour : బీజేపీ క్లస్టర్ల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. సభలు, సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ సమావేశాలకు అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలోనే మంత్రి అమిత్​ షా పర్యటన ఖరారు చేయగా ప్రస్తుతం రద్దు అయిందని కిషన్ రెడ్డి తెలిపారు.

వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక - ఏ పార్టీతోనూ కలవబోమన్న కిషన్ రెడ్డి

భారత్​ మాల, ఆర్​ఆర్​ఆర్​ ప్రాజెక్ట్​లపై సీఎం రేవంత్​కు కిషన్​ రెడ్డి లేఖ

Last Updated : Jan 27, 2024, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.