YS Viveka Funeral Program in Kadapa : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడప విజయ గార్డెన్స్‌లో ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీల నేతలు హాజరై వైఎస్ వివేకా చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత దంపతులు, ఏఐసీసీ నేత తులసిరెడ్డి, టీడీపీ నేతలు బీటెక్ రవి, సి.రామచంద్రయ్య తదితరులు హాజరై ప్రసంగించారు. వివేకా హత్యకు కారకులైన వారికి కోర్టు, ప్రజాకోర్టులో శిక్ష పడాలని తులసిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో హంతకులకు శిక్షపడాలని పేర్కొన్నారు.
హంతకుల పార్టీకి ఓటేయొద్దు- జగనన్న పార్టీ గెలవొద్దు: వైఎస్ సునీత
మాజీ మంత్రి వివేకా హత్యకు కారకులైన వారికి కోర్టులోను, ప్రజా కోర్టులో శిక్షపడాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. కడప విజయ గార్డెన్స్‌లో వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వివేకా కుమార్తె సునీత దంపతులు, తులసిరెడ్డి, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. వివేకా చిత్రపటానికి సునీత దంపతులు, తులసిరెడ్డి నివాళులర్పించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులకు ప్రజాకోర్టులో శిక్షపడాలన్నారు.
అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల
వైఎస్ వివేకానందరెడ్డికి కుటుంబ సభ్యుల నుంచే మృత్యువు రావడం చాలా బాధాకరం అని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. తమపై ఆరోపణలు చేసి ఆయన్ను చూసేందుకు కూడా వెళ్లనివ్వలేదని గుర్తు చేసుకున్నారు. ఇంత దారుణానికి వ్యవహరించిన వారికి శిక్ష పడాల్సిందేనని బీటెక్ రవి పేర్కొన్నారు. ఇప్పటికీ దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారని వాపోయారు.
శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేక పోయా: వివేకా సతీమణి
తన తండ్రి హత్యకు కారకులైన వారిపై సునీత అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్నారని సి. రామచంద్రయ్య అన్నారు. వివేకా హత్యకు కారకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హత్య కారకులకు శిక్ష పడితేనే వివేకా ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు. మానవతా దృక్పథం ఉంటేనే రాజకీయాలకు విలువ ఉంటుందన్న రామచంద్రయ్య హత్యా రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.
హత్య చేసింది బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నా ఇంత వరకూ హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్నాన్న చావుతో ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ, సునీత అని చెప్తూ బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. కాగా, తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని, వివేకానందరెడ్డికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని సునీత అన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయవద్దని, వచ్చే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆమె పిలుపునిచ్చారు.
జగన్ వైఎస్ వివేకాను చంపిందెవరో చెప్పు - ఆ తర్వాతే ఓట్లు అడుగు : చంద్రబాబు