ETV Bharat / politics

మరో జాతీయ సర్వేలోనూ టీడీపీకే పట్టం - తెలంగాణలో కాంగ్రెస్​కు ఆధిక్యం - National Survey Results

TDP, Janasena, BJP Alliance will Win : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంచలన విజయం ఖాయమని జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ సర్వేలో ఊహించని విధంగా ఎన్​డీఏ కూటమి ప్రజా మద్దతు కూడగడుతుందని తెలిపింది.

cvoter_abp_survey_result
cvoter_abp_survey_result
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 7:25 PM IST

Updated : Mar 14, 2024, 7:54 PM IST

TDP, Janasena, BJP alliance will Win : టీడీపీ-బీజేపీ- జనసేన కూటమి చరిత్రను తిరగరాయనుందా ? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంగా మోగించనుందా? ధన బలాన్నే నమ్ముకున్న వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పలు సర్వేలు ఈ విషయాన్ని చాటగా తాజాగా ఏబీపీ అనే సంస్థ కోసం సీ-ఓటర్​ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 20 లోక్​సభ స్థానాలు టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్​డీఏ కూటమి గెలుచుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ కేవలం 5 స్థానాలకే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రకటించిన జాతీయ సర్వేల ఫలితాలన్నీ టీడీపీకే పట్టం కట్టడం విశేషం. ఫిబ్రవరి చివర, మార్చి మొదటి వారంలో ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్​కు ఆధిక్యం రావచ్చని అంచనా వేసింది.

పిఠాపురం నుంచి బరిలో పవన్​కల్యాణ్​ - స్వయంగా వెల్లడించిన జనసేనాని

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 12 విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడగా టీడీపీ 144, జనసేన, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఓ అడుగు ముందుకేసిన టీడీపీ తొలి జాబితాలో 94 మంది, తాజాగా గురువారం విడుదల చేసిన మలి జాబితాలో 34 మంది గెలుపు గుర్రాలను ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో తెలిపారు. మొత్తం 25 లోక్​సభ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 5, జనసేన 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట - ఆశీర్వదించి గెలిపించాలి: చంద్రబాబు

ఈ సంస్థ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10 వరకు సర్వే చేపట్టింది. మొత్తం 41,762 మంది అభిప్రాయాలను ఆన్​లైన్ (CATI)​ ద్వారా నమోదు చేసింది. వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి టీడీపీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. తాము వెల్లడించిన ఫలితాలు 95 శాతం కచ్చితత్వం సాధిస్తాయని సర్వే సంస్థ ధీమా వ్యక్తం చేసింది.

ఈ సర్వేలో ప్రజాభిప్రాయం ప్రకారం ఏపీలో టీడీపీ బలంగా NDA 45 శాతం ఓట్లను సాధిస్తుందనేది అంచనా. ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓటింగ్​ దక్కించుకుని ద్వితీయ స్థానంలో ఉంటుందని తెలుస్తోంది. INDIA కూటమికి 3% ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది.

టీడీపీ రెండో జాబితా విడుదల చేసిన చంద్రబాబు- 34మందికి చోటు

Last Updated : Mar 14, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.